Iran israel: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తత.. విమానయాన ప్రయాణికులకు అలర్ట్
ABN, Publish Date - Apr 14 , 2024 | 01:21 PM
ఇజ్రాయెల్- ఇరాన్(israel-iran) దేశాల మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అనేక ప్రధాన విమానయాన సంస్థలు ఇరాన్‌కు విమానాలను రద్దు చేశాయి. దీంతోపాటు ఇజ్రాయెల్‌కు కూడా గగనతల వినియోగాన్ని పరిమితం చేశాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిర్ ఇండియా, విస్తారా విమాన(flights) మార్గాల ప్రయాణంపై ప్రకటనలు విడుదల చేశాయి.
ఇజ్రాయెల్- ఇరాన్(israel-iran) దేశాల మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అనేక ప్రధాన విమానయాన సంస్థలు ఇరాన్‌కు విమానాలను రద్దు చేశాయి. దీంతోపాటు ఇజ్రాయెల్‌కు కూడా గగనతల వినియోగాన్ని పరిమితం చేశాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిర్ ఇండియా(air india), విస్తారా విమాన(flights) మార్గాల ప్రయాణంపై ప్రకటనలు విడుదల చేశాయి.
మేము మధ్యప్రాచ్యంలో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఎయిరిండియా(air india) ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం తాము ప్రయాణీకుల భద్రత దృష్ట్యా అత్యంత ప్రాధాన్యతతో ప్రత్యామ్నాయ మార్గాల్లో(routes) విమానాలను నడుపుతున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ప్రయాణీకుల భద్రత, కార్యాచరణ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి సుదీర్ఘ మార్గాలను ఎంచుకుంటున్నట్లు తెలిపారు.
దీంతో ఎయిర్ ఇండియా(air india) విమానాలు యూరప్‌కు బయలుదేరే క్రమంలో పాకిస్తాన్-ఇరాన్-టర్కీ మార్గంలో ప్రయాణించకుండా ఉత్తరాన తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అజర్‌బైజాన్‌ల వైపు నుంచి వెళ్తున్నాయి. రూట్ మార్చడం వల్ల విమానాల సమయం 20-30 నిమిషాలు పెరుగుతుందని ప్రయాణికులు చెబుతున్నారు. మధ్యప్రాచ్యంలో గగనతలాన్ని నివారించేందుకు ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్ ఎయిర్‌వేస్ తన సేవలను తాత్కాలికంగా దారి మళ్లించింది. కంపెనీ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నందున పెర్త్ నుంచి లండన్‌కు QF9 విమానం సింగపూర్ మీదుగా వెళ్తుంది.
విస్తారా(vistara) కూడా ఈ అంశంపై తన ప్రకటనను విడుదల చేసింది. మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేస్తున్న ప్రస్తుత పరిస్థితులపై కొన్ని విమానాల మార్గాలలో మేము మార్పులు చేస్తున్నామని విస్తారా ప్రతినిధి చెప్పారు. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త ప్రస్తుత పరిస్థితుల కారణంగా మేము మా విమానాలలో కొన్నింటికి మార్పులు చేసినట్లు వెల్లడించారు. దీంతో పలు విమానాల సమయాలు, కొన్ని మార్గాల్లో జాప్యాలు సంభవించవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరికొన్ని ఫ్లైట్స్(flights) కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణిస్తున్నాయి.
ఇది కూడా చదవండి:
SIP: ప్రతి రోజు రూ.110 ఇన్‌వెస్ట్ చేయండి.. కోటీశ్వరులుగా మారండి
Special Trains: రూ.200తో రామాలయం టూర్.. సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం
Updated Date - Apr 14 , 2024 | 01:25 PM