ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SBI: డిపాజిట్ల వృద్ధి మందగించడంపై ఎస్బీఐ ఛైర్మన్ స్పందన.. నిధులు సమకూర్చుకోగలమని ధీమా

ABN, Publish Date - Aug 24 , 2024 | 04:10 PM

బ్యాంకు డిపాజిట్లు అంతకంతకూ తగ్గుతుండటం రుణాల పంపిణీ పెరుగుతుండటంపై ఆందోళనలు చెలరేగుతున్న వేళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఛైర్మాన్ దినేశ్ ఖరా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: బ్యాంకు డిపాజిట్లు అంతకంతకూ తగ్గుతుండటం రుణాల పంపిణీ పెరుగుతుండటంపై ఆందోళనలు చెలరేగుతున్న వేళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఛైర్మాన్ దినేశ్ ఖరా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని ఆయన స్పష్టం చేశారు. రుణాల వృద్ధి కోసం అవసరమయ్యే నిధులను సమకూర్చుకునే సామర్థ్యం బ్యాంకుకు ఉందని పేర్కొన్నారు. గత 15 రోజుల్లో క్రెడిట్ వృద్ధి 13.8 శాతానికి మందగించడం, డిపాజిట్ వృద్ధి 10.3 శాతానికి తగ్గడంతోఎస్బీఐ నిర్ణయాలపై ఉత్కంఠ ఏర్పడింది.

"రుణాల వృద్ధి కోసం నిధులు సమకూర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాం. ఇది మాకు సవాలు కాదు" అని దినేశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎస్‌బీఐకి రూ.16 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఉన్నాయని, రుణాల మంజూరు కోసం ఇందులో కొన్ని షేర్లను ఉపసంహరించుకుంటామని చెప్పారు. పెట్టుబడులు పెట్టడం కంటే రుణాలివ్వడంతోనే అధిక రాబడి వస్తుందని ఆయన చెప్పడం గమనార్హం.


తగ్గుతున్న డిపాజిట్ల వృద్ధి..

దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ వ్యవస్థలో రెండేళ్లుగా రుణాల వృద్ధి కంటే డిపాజిట్ల వృద్ధి తగ్గుతూ వస్తోంది. ఎస్‌బీఐలోనూ ఇదే పరిస్థితి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఎస్బీఐ... డిపాజిట్లలో సంవత్సరానికి 8.18 శాతం వృద్ధిని నమోదు చేసింది. తద్వారా రూ. 49.02 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 45.31 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.

FY23లో అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ASCB) 1951-52 నుంచి డిపాజిట్లు, క్రెడిట్ రెండింటిలోనూ సంపూర్ణ వృద్ధిని నమోదు చేశాయి. డిపాజిట్లు రూ.15.7 లక్షల కోట్లు, క్రెడిట్ రూ. 17.8 లక్షల కోట్లు పెరిగింది. క్రెడిట్.. డిపాజిట్ (CD) నిష్పత్తిని 113 శాతానికి నెట్టింది. ఈ జోరు FY24 వరకు కొనసాగింది. అలా డిపాజిట్లు రూ. 24.3 లక్షల కోట్లు, క్రెడిట్ రూ. 27.5 లక్షల కోట్ల మేర పెరిగాయి. దశాబ్ద డిపాజిట్లు 2.75 రెట్లు, దశాబద్ద క్రెడిట్ 2.8 రెట్లు పెరిగింది.

Updated Date - Aug 24 , 2024 | 04:14 PM

Advertising
Advertising
<