ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

FASTag: మార్చి 15తో పేటీఎం సేవలు బంద్.. ఫాస్టాగ్ ఖాతాను మూసేయండిలా

ABN, Publish Date - Mar 14 , 2024 | 05:37 PM

కేవైసీ నిబంధనలు ఉల్లంఘించిందనే కారణంతో పేటీఎంపై ఆర్బీఐ కఠిన ఆంక్షలు విధించింది. కొత్త కస్టమర్లను అనుమతించకుండా నిషేధం విధించింది. మార్చి 15 తర్వాత, కొత్త కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ కార్డ్‌లు, Paytm వాలెట్‌లు, డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్-అప్‌లు పని చేయవు.

ఢిల్లీ: కేవైసీ నిబంధనలు ఉల్లంఘించిందనే కారణంతో పేటీఎంపై ఆర్బీఐ కఠిన ఆంక్షలు విధించింది. కొత్త కస్టమర్లను అనుమతించకుండా నిషేధం విధించింది. మార్చి 15 తర్వాత, కొత్త కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ కార్డ్‌లు, Paytm వాలెట్‌లు, డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్-అప్‌లు పని చేయవు. వీటిలో ఫాస్ట్‌ట్యాగ్‌లు కూడా ఉన్నాయి.

ఫాస్ట్‌ట్యాగ్‌లను అత్యధికంగా జారీచేసిన వాటిల్లో Paytm బ్యాంక్ ఒకటి. Paytm FASTag వినియోగదారులు శుక్రవారంలోగా తమ ఖాతాలను డీయాక్టివేట్ చేసి మరొక అకౌంట్ నుంచి ఫాస్టాగ్ పొందాలి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) Paytm ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులు మార్చి 15లోపు మరొక బ్యాంక్ జారీ చేసిన కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌ని కొనుగోలు చేయాలని సూచించింది.

FASTag ఖాతాను ఎలా మూసివేయాలి

  • Paytm వెబ్‌సైట్ లోకి వెళ్లండి లేదా Paytm యాప్ నుంచి లాగిన్ చేయండి.

  • FASTag విభాగానికి వెళ్లండి లేదా యాప్‌లో 'FASTag' కోసం సర్చ్ చేయండి.

  • సెట్టింగ్‌లు ఆప్షన్ పై క్లిక్ చేసి అకౌంట్ మేనేజ్మెంట్ కు వెళ్లండి. 'మూసివేయి' లేదా 'మీ ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాను నిష్క్రియం చేయు' అనే ఆప్షన్ ని ఎంపిక చేయండి.

  • అవసరమైన సమాచారాన్ని ఇవ్వండి.

  • వివరాలను నిర్ధారించండి.

  • మూసివేత అభ్యర్థన విజయవంతంగా ప్రాసెస్ అయిన తర్వాత, మీరు ఇమెయిల్ లేదా యాప్ నోటిఫికేషన్ ద్వారా Paytm నుండి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. మీ ఫాస్ట్‌ట్యాగ్ 5-7 పని దినాలలో క్లోజ్ అవుతుంది. సెక్యూరిటీ డిపాజిట్, మినిమమ్ బ్యాలెన్స్ ఉన్నవారి అమౌంట్ Paytm పేమెంట్స్ బ్యాంక్ వాలెట్‌కి రీఫండ్ అవుతాయి.

  • అప్పటికీ Paytm FASTag ఖాతాను క్లోజ్ చేయలేకపోతే Paytm కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించండి.


స్టేటస్ తనిఖీ చేయండిలా..

  • Paytm టోల్-ఫ్రీ నంబర్‌ 1800-120-4210 కి కాల్ చేయండి

  • వాహన రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఫాస్ట్‌ట్యాగ్ IDతో పాటు మీ ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాతో అనుసంధానించిన మొబైల్ నంబర్‌ను పేర్కొనాలి.

  • FASTag ఖాతా మూసివేయడాన్ని నిర్ధారించడానికి కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ మీతో కాంటాక్ట్ అవుతారు.

మీరు Paytm యాప్ లేదా వెబ్‌సైట్‌లోని FASTag సబ్ వాలెట్‌లోని "మ్యానేజ్ ట్యాగ్స్" విభాగంలో ఫాస్టాగ్ యాక్టివ్ గా ఉందా లేదా తెలుసుకోవచ్చు.

Updated Date - Mar 14 , 2024 | 05:37 PM

Advertising
Advertising