Viral News: లష్కరే తోయిబా అంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఫోన్.. తర్వాత ఏమైందంటే..
ABN, Publish Date - Nov 17 , 2024 | 11:30 AM
దేశంలో కొన్ని రోజుల క్రితం రైల్వే స్టేషన్, స్కూల్స్, పలు ఆస్పత్రులకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతోపాటు ఇటివల ఎయిర్ పోర్టులకు ఇలాంటి కాల్స్ వస్తే అనేక విమాన సర్వీసులు ఆగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ తాజాగా మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లష్కరే తోయిబా అంటూ ఫోన్ వచ్చింది.
దేశంలో ఓ కేటుగాడు ఏకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే(RBI) వార్నింగ్ ఇచ్చాడు. ఫోన్ చేసిన వ్యక్తి తనను తాను లష్కరే తోయిబా సీఈవో చెప్పుకోవడం విశేషం. ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్‌కు ఈ కాల్ వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీ గార్డుకు ఈ ఫోన్ చేసినట్లు సమాచారం. ఆ వ్యక్తి ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో తనకు సంబంధం ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఆ క్రమంలో బ్రాంచ్ వెనుక మార్గం మూసేయాలని, ఎలక్ట్రిక్ కారు చెడిపోయిందని ఆ వ్యక్తి చెప్పాడని చెబుతున్నారు. అయితే ఆ కాల్ చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏడాది నుంచి బెదిరింపులు
అంతకు ముందు గురువారం (నవంబర్ 15) ముంబైలోని JSA న్యాయ సంస్థ బల్లార్డ్ పెయిర్, JSA కార్యాలయం కమ్లా మిల్ లోయర్ పెర్ల్‌పై బాంబులు వేస్తామని ఓ బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. కంపెనీ అధికారిక IDకి ఈ మెయిల్ వచ్చింది. పంపిన వ్యక్తి పేరు ఫర్జాన్ అహ్మద్. సంస్థ కార్యాలయం, బల్లార్డ్ ఎస్టేట్ కార్యాలయంలో బాంబులు ఉంచినట్లు అతను పేర్కొన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. ఇది కూడా ఎవరైనా కావాలనే చేశారా లేదా నిజమేనా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇలాంటి కాల్స్ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వారిని పట్టుకోవడం పోలీసులకు తలనొప్పిగా తయారైంది.
భయాందోళనకు గురైన సిబ్బంది
గతంలో బాంబుతో విమానాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపులు కూడా వచ్చాయి. గత గురువారం (నవంబర్ 14) ముంబై విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న సీఐఎస్‌ఎఫ్‌కి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి బాంబుతో విమానాశ్రయాన్ని పేల్చివేస్తానని బెదిరించాడు. దీంతో ఎయిర్‌పోర్టులో మోహరించిన భద్రతా సిబ్బంది సహా ఇతర వ్యక్తులు భయాందోళనకు గురయ్యారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి సీఐఎస్ఎఫ్ ఉద్యోగికి ఫోన్ చేసి విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు చెప్పాడు. మహ్మద్ అనే వ్యక్తి పేలుడు పదార్థాలతో ముంబై నుంచి అజర్‌బైజాన్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది.
గతంలో కూడా..
అక్టోబర్ 27న కూడా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో బెదిరింపులు వచ్చాయి. విమానం పేలితే ప్రయాణికులెవరూ ప్రాణాలతో బయటపడరని చెప్పారు. విచారణలో ఈ బెదిరింపు అబద్ధమని తేలింది. గత ఏడాది కాలంగా దేశంలోని పాఠశాలలు, హోటళ్లు, విమానాశ్రయాలు, మార్కెట్లు, రైళ్లు, బస్సులు తదితరాలపై బాంబులు వేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. అయితే అవన్నీ నకిలీవని తేలింది. ఇలాంటి కాల్స్ చేసే వారి విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Air Pollution: రాజధానిలో దారుణం.. ఐదో రోజు అదే వాయు కాలుష్యం, బతికేదేలా..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..
Read More International News and Latest Telugu News
Updated Date - Nov 17 , 2024 | 11:33 AM