ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మూడో రోజూ మార్కెట్‌కు నష్టాలే

ABN, Publish Date - Dec 19 , 2024 | 05:20 AM

ఈక్విటీ సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్‌ మరో 502.25 పాయింట్లు పతనమై 80,182.20 వద్దకు జారుకుంది. నిఫ్టీ 137.15 పాయింట్లు క్షీణించి...

ముంబై: ఈక్విటీ సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్‌ మరో 502.25 పాయింట్లు పతనమై 80,182.20 వద్దకు జారుకుంది. నిఫ్టీ 137.15 పాయింట్లు క్షీణించి 24,198.85 వద్ద స్థిరపడింది. అమెరికన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పరపతి సమీక్ష నిర్ణయాలను ప్రకటించనున్న నేపథ్యంలో మదుపరులు ముందుజాగ్రత్తగా అమ్మకాలకు పాల్పడటం ఇందుకు కారణం. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు సైతం తరలిపోతుండటం మార్కెట్‌పై ఒత్తిడిని మరింత పెంచింది.


జీవితకాల కనిష్ఠానికి రూపాయి: భారత కరెన్సీ సరికొత్త జీవనకాల కనిష్ఠ స్థాయికి క్షీణించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 3 పైసలు నష్టపోయి రూ.84.94 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్లో నష్టాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణతోపాటు దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్‌ పెరగడం ఇందుకు కారణమైందని ఫారెక్స్‌ వర్గాలు తెలిపాయి.

  • క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ (క్యూఐపీ) ద్వారా సంస్థాగత ఇన్వెస్టర్లకు ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.1,000 కోట్లు సమీకరించినట్లు కల్పతరు ప్రాజెక్ట్స్‌ ఇంటర్నేషనల్‌ (కేపీఐఎల్‌) వెల్లడించింది.

Updated Date - Dec 19 , 2024 | 05:20 AM