ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maruti Electric Vitara : భారత్‌ మొబిలిటీ ఎక్స్‌పోలో మారుతి ఎలక్ట్రిక్‌ విటారా ఆవిష్కరణ

ABN, Publish Date - Dec 21 , 2024 | 04:39 AM

కంపెనీకి చెందిన తొలి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఈ-విటారాను ప్రవేశపెట్టడంతో పాటు సమాంతరంగా చార్జింగ్‌ స్టేషన్లు, హోమ్‌ చార్జింగ్‌ సొల్యూషన్లు అందుబాటులోకి తెస్తామని దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ

న్యూఢిల్లీ: కంపెనీకి చెందిన తొలి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఈ-విటారాను ప్రవేశపెట్టడంతో పాటు సమాంతరంగా చార్జింగ్‌ స్టేషన్లు, హోమ్‌ చార్జింగ్‌ సొల్యూషన్లు అందుబాటులోకి తెస్తామని దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ప్రకటించింది. త్వరలో ఢిల్లీలో జరగబోయే భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2025లో ఈ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని ఆవిష్కరించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఇది ప్రపంచ మార్కెట్ల కోసం భారత్‌లో తయారైన గ్లోబల్‌ మోడల్‌ అని పేర్కొంది. ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహించాలంటే కస్టమర్లకు బ్యాటరీ విద్యుత్‌ వాహన యాజమాన్యాన్ని సరళం చేయాలన్నద తమ అభిప్రాయమని కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (మార్కెటింగ్‌, సేల్స్‌) పార్థో బెనర్జీ చెప్పారు. సరైన చార్జింగ్‌ మౌలిక వసతులు లేకపోవడమే ఈవీ వినియోగానికి పెద్ద అవరోధమని ఆయన అన్నారు. అధిక శాతం కస్టమర్లకు ఈవీలు అందుబాటులో, సౌకర్యవంతంగా ఉండేలా చూడాలన్నది తమ ఆలోచన అని చెప్పారు.

Updated Date - Dec 21 , 2024 | 04:39 AM