Mark Zuckerberg: ఒక్క రోజులోనే భారీగా పెరిగిన మార్క్ జుకర్‌బర్గ్ సంపద.. ఎన్ని కోట్లంటే..
ABN, Publish Date - Feb 04 , 2024 | 10:41 AM
ఫేస్‌బుక్(meta) సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్(mark zuckerberg) సంపద భారీగా పెరిగింది. తాజాగా ఒక్కరోజులోనే ఏకంగా 28.1 బిలియన్ డాలర్లు(రూ.2,810 కోట్లు) ఆర్జించారు. దీంతో మార్క్ జుకర్‌బర్గ్ సంపద 170.5 బిలియన్ డాలర్లకు(రూ.17 వేల కోట్లు) చేరింది.
ఫేస్‌బుక్(meta) సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్(mark zuckerberg) సంపద భారీగా పెరిగింది. తాజాగా ఒక్కరోజులోనే ఏకంగా 28.1 బిలియన్ డాలర్లు(రూ.2,810 కోట్లు) ఆర్జించారు. దీంతో మార్క్ జుకర్‌బర్గ్ సంపద 170.5 బిలియన్ డాలర్లకు(రూ.17 వేల కోట్లు) చేరింది. ఈ క్రమంలో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో బిల్ గేట్స్‌ను అధిగమించి జుకర్ బర్గ్ నాల్గో స్థానానికి చేరుకున్నారు. ఇది తనకు భారీ పునరాగమనం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన 2022 చివరిలో ద్రవ్యోల్బణం, పెరిగిన వడ్డీ రేట్లు వంటి పలు కారణాలతో 35 బిలియన్ డాలర్లు కోల్పోవడంతో తన సంపద పెద్ద ఎత్తున తగ్గింది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Namibia President: నమీబియా ప్రెసిడెంట్ హేజ్ గింగోబ్ మృతి..కారణమిదే
అయితే Meta త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో వాల్ స్ట్రీట్ అంచనాలను మించి మెటా షేర్లు 20% పుంజుకున్నాయి. దీంతో Facebook సహ వ్యవస్థాపకుడి నికర విలువ 28.1 బిలియన్ డాలర్లు పెరిగింది. మెటాలో దాదాపు 21,000 మందిని తొలగించి పలు మార్పులు చేసిన తర్వాత 2023లో ఈ స్టాక్ దాదాపు మూడు రెట్లైంది. జుకర్‌బర్గ్ దాదాపు 350 మిలియన్ క్లాస్ A, B షేర్లను కలిగి ఉన్నారు. Meta దాని 50 శాతం త్రైమాసిక డివిడెండ్‌ను కొనసాగిస్తే, జుకర్‌బర్గ్ సంవత్సరానికి 690 మిలియన్ డాలర్లకు పైగా సంపాదిస్తారు.
మరోవైపు తమ పిల్లల ఆత్మహత్యలు లేదా దుర్వినియోగంలో ఇన్‌స్టాగ్రామ్ పాత్ర ఉందని ఇటివల పేర్కొన్న తల్లిదండ్రులకు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు చెప్పారు. 'బిగ్ టెక్ అండ్ ది ఆన్‌లైన్ చైల్డ్ సెక్స్ అబ్యూజ్ క్రైసిస్' పేరుతో జరిగిన విచారణలో జుకర్‌బర్గ్, ఇతర సోషల్ మీడియా CEOలను వారి ప్లాట్‌ఫారమ్‌ల భద్రత గురించి ప్రశ్నలు అడిగారు.
బాధిత తల్లిదండ్రులకు నేరుగా క్షమాపణలు చెప్పాలని US సెనేట్ జ్యుడిషియరీ కమిటీ సభ్యుడు జోష్ హాలీ ఒత్తిడి చేయడంతో జుకర్‌బర్గ్ క్షమాపణలు చెప్పారు. విచారణ సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లల ఫోటోలతో కోర్టుకు హాజరయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా మెటా కట్టుబడి ఉంటుందని జుకర్‌బర్గ్ తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.
Updated Date - Feb 04 , 2024 | 10:41 AM