ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రైవేట్‌ బ్యాంకులకు తప్పని ఉద్యోగుల వలసలు

ABN, Publish Date - Dec 30 , 2024 | 04:22 AM

దేశంలోని ప్రైవేట్‌ బ్యాంకులకు కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయి. ఉద్యోగుల్లో ఏటా 25 శాతం మంది ఈ బ్యాంకుల నుంచి వలస పోవటమో (అట్రిషన్‌) లేదంటే గుడ్‌బై చెప్పటమో...

25 శాతానికి చేరిన అట్రిషన్‌

బ్యాంకుల నిర్వహణా కష్టాలు పెరుగుతున్నాయ్‌ : ఆర్‌బీఐ

న్యూఢిల్లీ: దేశంలోని ప్రైవేట్‌ బ్యాంకులకు కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయి. ఉద్యోగుల్లో ఏటా 25 శాతం మంది ఈ బ్యాంకుల నుంచి వలస పోవటమో (అట్రిషన్‌) లేదంటే గుడ్‌బై చెప్పటమో జరుగుతోంది. గత మూడేళ్లుగా ఇదే పరిస్థ్థితి. ‘ట్రెండ్‌ అండ్‌ ప్రోగ్రెస్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ ఇన్‌ ఇండియా 2023-24’ పేరుతో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయం తెలిపింది. ఉద్యోగులు ఇంత పెద్దఎత్తున వలస పోవటం ఈ బ్యాంకుల నిర్వహణకు పెద్ద సమస్యగా మారనుందని హెచ్చరించింది. కొన్ని ప్రైవేట్‌ బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు (ఎస్‌ఎ్‌ఫబీ)ల్లో ఈ వలసల సమస్య మరింత ఎక్కువగా ఉంది.


పీఎస్‌బీలను మించిన సిబ్బంది: ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ)తో పోలిస్తే ప్రెవేట్‌ బ్యాంకుల్లో పని చేసే ఉద్యోగులే ఎక్కువ. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరాంతానికి పీఎ్‌సబీల్లో 7,64,679 మంది పని చేస్తుంటే.. ప్రైవేట్‌ బ్యాంకుల్లో 8,46,530 మంది పని చేస్తున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అప్పట్లో పీఎ్‌సబీల్లో 8,42,813 మంది పనిచేస్తుంటే ప్రైవేట్‌ బ్యాంకుల్లో పని చేస్తున్న సిబ్బంది 3,03,856 మాత్రమే. ‘పెద్దఎత్తున ఉద్యోగులు మానేయడం, ఒక్కో ఉద్యోగి ద్వారా సమకూరే సగటు టర్నోవర్‌ని దెబ్బతీస్తోంది. దీనివల్ల ఖాతాదారుల సేవలకూ ఇబ్బంది ఏర్పడుతోంది. దీనివల్ల ప్రైవేట్‌ బ్యాంకుల నియామకాల ఖర్చులూ పెరిగి పోతున్నాయి’ అని ఆర్‌బీఐ నివేదిక పేర్కొంది.


ఇవే నివారణ చర్యలు: ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ప్రైవేట్‌ బ్యాంకులు తీసుకోవాల్సిన చర్యలూ ఆర్‌బీఐ నివేదిక సూచించింది. విస్తృత శిక్షణ, ప్రమోషన్‌ అవకాశాలు పెంచడం, ప్రత్యేక ప్రోత్సాహకాలు, సిబ్బంది అదే బ్యాంకులో దీర్ఘకాలం పాటు పనిచేసేందుకు అనువైన వాతావరణం కల్పించడం వంటి వ్యూహాత్మక చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐ సూచించింది.

గోల్డ్‌ లోన్స్‌పై జర జాగ్రత్త: పసిడి రుణాల మంజూరు విషయంలో బ్యాంకులు ఇప్పటికీ కొన్ని తప్పిదాల చేయడాన్ని ఆర్‌బీఐ ఎత్తి చూపింది. ముఖ్యంగా థర్డ్‌ పార్టీలు ఈ రుణాల మదింపు, వాటిపై పర్యవేక్షణ సరిగా లేదని స్పష్టం చేసింది. నిర్ణీత కాల వ్యవధిలో బ్యాంకులు ఈ లోపాలను సరిదిద్దుకోవాలని సూచించింది.

Updated Date - Dec 30 , 2024 | 04:22 AM