Nestle: నెస్లే సెరెలాక్ ఉత్పత్తుల గురించి వెలుగులోకి సంచలన విషయాలు
ABN, Publish Date - Apr 18 , 2024 | 10:00 AM
పిల్లల కోసం అనేక ఉత్పత్తులను తయారు చేసే ప్రముఖ కంపెనీ నెస్లే(Nestle) గురించి అనేక మందికి తెలుసు. అందులో సెరెలాక్(Cerelac) ఉత్పత్తి కూడా ఒకటి. అయితే ఆసియా, ఆఫ్రికన్, లాటిన్ అమెరికా దేశాల్లో పంపిణీ చేసే సెరెలాక్ ఉత్పత్తుల్లో అత్యధిక స్థాయి చక్కెరను ఉపయోగించి ఉల్లంఘనలకు పాల్పడ్డారని స్విట్జర్లాండ్‌లోని పబ్లిక్ ఐ అనే పరిశోధనా సంస్థ షాకింగ్ నివేదికను వెల్లడించింది.
పిల్లల కోసం అనేక ఉత్పత్తులను తయారు చేసే ప్రముఖ కంపెనీ నెస్లే(Nestle) గురించి అనేక మందికి తెలుసు. అందులో సెరెలాక్(Cerelac) ఉత్పత్తి కూడా ఒకటి. అయితే ఆసియా, ఆఫ్రికన్, లాటిన్ అమెరికా దేశాల్లో పంపిణీ చేసే సెరెలాక్ ఉత్పత్తుల్లో అత్యధిక స్థాయి చక్కెరను ఉపయోగించి ఉల్లంఘనలకు పాల్పడ్డారని స్విట్జర్లాండ్‌లోని పబ్లిక్ ఐ అనే పరిశోధనా సంస్థ షాకింగ్ నివేదికను వెల్లడించింది. అందులో భాగంగా భారతదేశంలో(india) నెస్లే ద్వారా అత్యధికంగా అమ్ముడవుతున్న బేబీ ఫుడ్ బ్రాండ్‌లలో రెండు అధిక స్థాయి చక్కెరను(sugar) కలిగి ఉన్నాయని రిపోర్ట్ తెలిపింది.
ఒక సంవత్సరం, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న శిశువులు(childrens) ఉపయోగించే సెరెలాక్ నమూనాలలో (ఫాలో-అప్ మిల్క్ ఫార్ములా బ్రాండ్)కి సుక్రోజ్ లేదా తేనె రూపంలో నెస్లే చక్కెరను జోడించిందని వెల్లడించింది. ఈ ఉత్పత్తులు ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల వయస్సు పిల్లలకు తృణధాన్యాల రూపంలో అందిస్తారు. భారతదేశంలో(bharat) 2022లో ఈ అమ్మకాలు 250 మిలియన్ డాలర్లకు మించవచ్చని అంచనా వేసినప్పుడు అన్ని సెరెలాక్ ఉత్పత్తులు ప్రతి ఉత్పత్తిలో సగటున 3 గ్రాముల అదనపు చక్కెరను కలిగి ఉన్నాయని నివేదిక పేర్కొంది.
ఆఫ్రికా ఖండంలోని ప్రధాన మార్కెట్ అయిన దక్షిణాఫ్రికా(south africa)లో కూడా ఇదే పరిస్థితి ఉందని నివేదిక తెలిపింది. ఇక్కడ అన్ని సెరెలాక్ శిశు తృణధాన్యాలు ప్రతి సర్వింగ్‌లో నాలుగు గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ చక్కెరను కలిగి ఉన్నాయని నివేదిక వెల్లడించింది. మరోవైపు యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ స్విట్జర్లాండ్ వంటి ఇతర అభివృద్ధి చెందిన దేశాలలో ఇటువంటి ఉత్పత్తులు చక్కెర రహితంగా ఉన్నాయని దర్యాప్తులో తేలింది. ఇండోనేషియాలో డాంకో పేరుతో విక్రయించబడే నిడో బేబీ-ఫుడ్ ఉత్పత్తులలో 100 గ్రాముల ఉత్పత్తికి 2 గ్రాముల జోడించిన చక్కెర లేదా ప్రతి ఉత్పత్తికి 0.8 గ్రాములు తేనె రూపంలో ఉన్నాయని చెప్పింది.
ఇది కూడా చదవండి:
SIP: ప్రతి రోజు రూ.110 ఇన్‌వెస్ట్ చేయండి.. కోటీశ్వరులుగా మారండి
Business Idea: ఉద్యోగానికి బై చెప్పేసి రూ.50,000తో వ్యాపారం.. ఇప్పుడు నెలకు లక్షల్లో ఆదాయం!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం
Updated Date - Apr 18 , 2024 | 10:03 AM