ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

New Rules: సిలిండర్ ధర నుంచి క్రెడిట్ కార్డుల వరకు.. సెప్టెంబర్‌లో మారనున్నవి ఇవే

ABN, Publish Date - Aug 30 , 2024 | 08:17 AM

ప్రతి నెలలాగే సెప్టెంబర్‌లోనూ అనేక ధరల్లో మార్పులు జరగనున్నాయి. పలు వస్తువుల ధరలతోపాటు కొన్నింటిలో మార్పులు రాబోతున్నాయి. అవేంటో పరిశీలిద్దాం.

హైదరాబాద్: ప్రతి నెలలాగే సెప్టెంబర్‌లోనూ అనేక ధరల్లో మార్పులు జరగనున్నాయి. పలు వస్తువుల ధరలతోపాటు కొన్నింటిలో మార్పులు రాబోతున్నాయి. అవేంటో పరిశీలిద్దాం.

ఎఫ్‌డీ వడ్డీ రేట్లు

ఐడీబీఐ బ్యాంక్‌ (IDBI Bank) డిపాజిట్లను పెంచుకునేందుకు తీసుకొచ్చిన ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్‌(FD Scheme) సెప్టెంబరు 30తో ముగియనుంది. 444 రోజుల పాటు చేసే ఎఫ్‌డీ డిపాజిట్లపై 7.35 శాతం వడ్డీని, సీనియర్‌ సిటిజన్లకు అత్యధికంగా 7.85 వడ్డీని బ్యాంకు అందిస్తోంది.

ఆధార్‌ ఫ్రీ అప్‌డేట్‌

ఆధార్ వివరాల్లో ఉచితంగా మార్పులుచేర్పులు చేసుకునేందుకు అప్‌డేట్‌ యునీక్ ఐడెంటికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) పొడిగించిన గడువు 2024 సెప్టెంబర్‌ 14న ముగియనుంది. గడువు సమీపిస్తుండటంతో ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గడువు ముగిస్తే ఆధార్‌ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్‌డేట్‌ చేసుకోవాలి.


రూపే కార్డులకు రివార్డులు..

ఇతర కార్డు లావాదేవీలపై అందించే రివార్డులు, ప్రయోజనాలలాగే రూపే కార్డులకు, వాటితో చేసే యూపీఐ లావాదేవీలకూ అందించాలని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (NPCI) నిర్ణయించింది. తద్వారా రూపే క్రెడిట్‌ కార్డుదారులకు ఉపయోగం జరగనుంది. సెప్టెంబర్‌ 1 నుంచి దీన్ని అమలు చేయాలని బ్యాంకులను ఎన్పీసీఐ ఆదేశించింది.

ఫేక్ కాల్స్‌పై దృష్టి..

మోసపూరిత కాల్స్‌ నుంచి రక్షించేందుకు, మెసేజింగ్‌ సేవలు దుర్వినియోగం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని టెలికాం సంస్థలను ట్రాయ్‌(TRAI) ఆదేశించింది. సెప్టెంబర్‌ 1 నుంచి వెబ్‌సైట్‌ లింకులు, ఏపీకే ఫైల్స్‌, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో కూడిన సందేశాలు పంపించకూడదని స్పష్టం చేసింది. సెప్టెంబర్‌ 30 నాటికి కాల్స్‌ను బ్లాక్‌ చైన్‌తో నడిచే డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్‌ టెక్నాలజీ (DLT)కి మార్చాలని గడువు నిర్దేశించింది.


క్రెడిట్‌ కార్డ్‌ నిబంధనలు..

క్రెడిట్‌ కార్డ్‌కు సంబంధించిన సెప్టెంబర్‌లో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకుల రివార్డు పాయింట్లలో మార్పులు రానున్నట్లు తెలుస్తోంది.

సిలిండర్‌ ధర..

ప్రతి నెలలాగే సిలిండర్ ధర సెప్టెంబర్ 1నే మారే అవకాశం ఉంది. ఇంట్లో వాడే సిలిండర్ల ధరల్లో మార్పు ఉండకపోయినప్పటికీ.. వాణిజ్య సిలిండర్ల ధరల్లో మార్పు ఉండవచ్చు. ఏటీఎఫ్‌, సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలూ మారే అవకాశం ఉంది.

For Latest News click here

Updated Date - Aug 30 , 2024 | 08:17 AM

Advertising
Advertising