No Tax: దేశంలో ఈ రాష్ట్ర వాసులకు నో ట్యాక్స్.. కారణమిదే..
ABN, Publish Date - Jul 31 , 2024 | 06:35 PM
సాధారణంగా మన దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు ట్యాక్స్(tax free) చెల్లింపులు చేస్తారని అనుకుంటాం. కానీ అందులో ఏ మాత్రం నిజం లేదు. ఓ రాష్ట్రానికి మాత్రం ప్రత్యేక మినహాయింపు అమలు చేస్తున్నారు. దీంతో అక్కడి రాష్ట్ర ప్రజలు పన్నులు చెల్లించకుండా ఉంటారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మన దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు ట్యాక్స్(tax free) చెల్లింపులు చేస్తారని అనుకుంటాం. కానీ అందులో ఏ మాత్రం నిజం లేదు. ఓ రాష్ట్రానికి మాత్రం ప్రత్యేక మినహాయింపులు అమలు చేస్తున్నారు. దీంతో అక్కడి రాష్ట్ర ప్రజలు పన్నులు చెల్లించకుండా ఉంటారు. అదే ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం(sikkim). మీరు కూడా ఈ ప్రాంత వాసులు అయినట్లైతే మీరు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నేడు (జులై 31న) ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు ప్రక్రియకు చివరి రోజు.
దీంతో అనేక మంది చెల్లింపుదారులు రిటర్న్‌లను దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సిక్కిం రాష్ట్ర వాసుల గురించి చర్చ వెలుగులోకి వచ్చింది. ఈ రాష్ట్రం గురించి ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. అయితే అసలు ఈ రాష్ట్ర వాసులు ఎందుకు పన్నులు చెల్లించరనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పన్ను ఎందుకు చెల్లించరు?
సిక్కిం రాష్ట్రం భారతదేశం(india)లో విలీనమైనప్పుడు ఓ షరతు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సిక్కిం ప్రజలు పన్ను(tax free) రహితంగా ఉంటున్నారు. సిక్కిం రాష్ట్ర 1975 విలీన ఒప్పందం రాజ్యాంగంలోని ఆర్టికల్ 371F ప్రకారం ఈ ప్రత్యేక ఉపశమనం కల్గించారు. దీంతో ఈ రాష్ట్ర వాసులకు ఆదాయపు పన్ను చట్టం 1961 వర్తించదు. 1975లో సిక్కిం భారత్‌లో విలీనమైంది. ఆ సమయంలోనే ప్రత్యేక హోదా ఇస్తామని, పాత చట్టాల ప్రకారం నడుచుకుంటామని షరతు పెట్టారు.
ఈ ప్రయోజనం..
ఆ నిబంధనల్లో సిక్కిం వాసులు ఆదాయపు పన్ను పరిధికి దూరంగా ఉంటారని స్పష్టం చేశారు. దీంతో సెక్యూరిటీలు, డివిడెండ్ల ద్వారా వచ్చే ఆదాయంపై కూడా వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే విలీనానికి ముందు సిక్కిం నివాసితులుగా ఉన్న పౌరులందరికీ మాత్రమే ఈ మినహాయింపు ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ఈ పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందడం ద్వారా సిక్కింలో వ్యాపార కార్యకలాపాలు, పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
నేడే చివరి తేదీ
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉన్న ప్రతి పౌరుడు ఆదాయపు పన్ను(income tax) రిటర్న్‌ను దాఖలు(itr filling) చేయాల్సి ఉంటుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు 5 కోట్ల మందికి పైగా రిటర్నులు దాఖలు చేశారు. ఆదాయపు పన్ను శాఖ లెక్కల ప్రకారం ఈ సంఖ్య రోజురోజుకు లక్షల్లో పెరుగుతోంది. గడువు తేదీ జులై 31, 2024 వరకు మీరు రిటర్న్‌ను ఫైల్ చేయకపోతే, ఆ తర్వాత మీరు రూ. 1000 నుంచి రూ. 5000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కానీ సిక్కింలో నివసిస్తున్న ప్రజలకు మాత్రం ఈ విషయాలతో ఎలాంటి సంబంధం లేదని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి:
Layoffs: మరో అగ్రసంస్థలో ఉద్యోగుల తొలగింపులు.. హైదరాబాద్, బెంగళూరులో కూడా..?
Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..
ITR Filling: ఐటీఆర్ దాఖలుకు నేడే లాస్ట్ ఛాన్స్.. గడువు పెంచుతారా, క్లారిటీ
Read More Business News and Latest Telugu News
Updated Date - Jul 31 , 2024 | 06:37 PM