ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NPCI: జీపే, ఫోన్ పేకు పోటీగా భీమ్ యాప్ సిద్ధం.. కీలక మార్పులు

ABN, Publish Date - Aug 12 , 2024 | 01:13 PM

పెరుగుతున్న UPI మార్కెట్‌ను అందుకునేందుకు BHIM యాప్‌ని ఒక ప్రత్యేక అనుబంధ సంస్థగా మార్చడానికి NPCI ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్వదేశీ చెల్లింపుల అప్లికేషన్ భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ (BHIM)ని అనుబంధ సంస్థగా చేసిందని అంటున్నారు.

NPCI plans to make bhim app

పెరుగుతున్న UPI మార్కెట్‌ను అందుకునేందుకు BHIM యాప్‌ని ఒక ప్రత్యేక అనుబంధ సంస్థగా మార్చడానికి NPCI ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్వదేశీ చెల్లింపుల అప్లికేషన్ భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ (BHIM)ని అనుబంధ సంస్థగా చేసిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో BHIM యాప్ దేశంలో తన ఉనికిని(business) మరింత పెంచుకోవాలని యోచిస్తోంది. అందుకోసం ఎన్‌పీసీఐ కొత్త అనుబంధ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా లలితా నటరాజ్‌ను నియమించినట్లు ఆయా వర్గాలు తెలిపాయి. నటరాజ్ గతంలో IDFC ఫస్ట్ బ్యాంక్, ICICI బ్యాంక్‌లలో పనిచేశారు. దీంతో ప్రధానంగా ఈ చెల్లింపు అప్లికేషన్‌గా అభివృద్ధి చేయడంపై మరింత దృష్టి సారించనున్నారు.


రెండు కంపెనీలపై

ఈ యాప్ అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం, RBI రెండూ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం భారత చెల్లింపుల వ్యవస్థలో గూగుల్ పే, వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫోన్ పే అనే రెండు కంపెనీలపై ప్రజలు అధికంగా ఆధారపడటాన్ని తగ్గించడమే ప్రభుత్వం ప్రణాళిక. ప్రస్తుతం PhonePe, Google Pay కలిసి భారతదేశంలో 85 శాతం UPI లావాదేవీలను ప్రాసెస్ చేస్తున్నాయి. దీంతో ఈ రెండు కంపెనీల ఆధిపత్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జూన్‌లో PhonePe 6.7 బిలియన్లను ప్రాసెస్ చేసింది. Google Pay 5.1 బిలియన్ UPI లావాదేవీలను ప్రాసెస్ చేసింది. పోల్చి చూస్తే BHIM యాప్ నెలలో 2.27 కోట్ల UPI లావాదేవీలను మాత్రమే ప్రాసెస్ చేయగలిగింది. ఇది మొత్తం చెల్లింపులలో కేవలం 0.16 శాతం మాత్రమే.


రీడిజైన్

అంతేకాదు BHIM అప్లికేషన్ ఇప్పుడు రీడిజైన్ చేయబడుతుందని కూడా ఆయా వర్గాలు తెలిపాయి. కొత్త అనుబంధ సంస్థ NPCI బ్రాండ్‌లో తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ప్రస్తుతం మొత్తం టర్నోవర్ NPCIలో నమోదు చేయబడింది. కానీ ఒక ప్రత్యేక సంస్థ ఏర్పడిన తర్వాత, దాని స్వంత ఖాతాల పుస్తకాలు, ఖర్చు నిర్మాణం మొదలైనవి మారుతుంటాయి. NPCI అభివృద్ధి చేసిన BHIM యాప్‌ను 2016లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ యాప్‌ని నేరుగా బ్యాంక్ చెల్లింపులు చేయడానికి, UPI నెట్‌వర్క్‌లో ఎవరి నుంచి అయినా డబ్బును అభ్యర్థించడానికి ఉపయోగించవచ్చు.


మొదటిసారి కాదు

కొత్త అనుబంధ సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా NPCI తన వ్యాపారాన్ని బదిలీ చేయాలని నిర్ణయించుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2021 సంవత్సరంలో ఇది భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS) లావాదేవీలను NPCI భారత్ బిల్‌పే లిమిటెడ్ (NBBL) పేరుతో కొత్త అనుబంధ సంస్థకు బదిలీ చేసింది. దీని ఫలితంగా దాని ఆటోమేటెడ్ బిల్లు చెల్లింపు వ్యాపారం వేరు చేయబడింది. NBBL అనేది NPCI పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ.


ఇవి కూడా చదవండి:

Multibagger Stock: రూ.1,113 నుంచి రూ.10,310కి చేరిన షేర్ ప్రైస్.. ఐదేళ్లలోనే మల్టీబ్యాగర్‌ లిస్ట్‌లోకి..


Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 12 , 2024 | 01:19 PM

Advertising
Advertising
<