ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Swiggy: 2030నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరనున్న ఫుడ్ మార్కెట్

ABN, Publish Date - Jul 04 , 2024 | 07:35 AM

దేశంలో ఆహార డెలివరీ బిజినెస్ 2030 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని బెయిన్‌ అండ్‌ కంపెనీ, స్విగ్గీ జాయింట్ రిపోర్ట్ వెల్లడించింది. యూజర్ల సంఖ్య అప్పటికి 45 కోట్ల వరకు చేరొచ్చని అంచనా వేసింది. ‘హౌ ఇండియా ఈట్స్‌’ పేరుతో ఈ రిపోర్ట్ విడుదల చేశారు. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ విభాగం 18 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు (CAGR) సాధించొచ్చని రిపోర్ట్ తెలిపింది.

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ఆహార డెలివరీ బిజినెస్ 2030 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని బెయిన్‌ అండ్‌ కంపెనీ, స్విగ్గీ జాయింట్ రిపోర్ట్ వెల్లడించింది. యూజర్ల సంఖ్య అప్పటికి 45 కోట్ల వరకు చేరొచ్చని అంచనా వేసింది. ‘హౌ ఇండియా ఈట్స్‌’ పేరుతో ఈ రిపోర్ట్ విడుదల చేశారు.

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ విభాగం 18 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు (CAGR) సాధించొచ్చని రిపోర్ట్ తెలిపింది. 2023లో ఆహార డెలివరీ బిజినెస్ వాటా 12 శాతం ఉండగా, 2030 నాటికి 20 శాతానికి చేరొచ్చని వెల్లడించింది. భారత్‌లో ఆహార సేవల విపణి ప్రస్తుతం రూ.5.5 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. వచ్చే ఏడేళ్లు వార్షికంగా 10-12 శాతం వృద్ధితో సాగి, 2030 నాటికి రూ.9-10 లక్షల కోట్లకు చేరొచ్చు.


“భారత ఆహార సేవల మార్కెట్ ముఖ్యంగా ఫుడ్ డెలివరీ, గత కొన్ని సంవత్సరాలుగా అద్భుతమైన వృద్ధి సాధించింది. అధిక ఆదాయాలు, డిజిటలైజేషన్, మెరుగైన కస్టమర్ అనుభవం ఇవన్నీ వృద్ధికి దోహదపడ్డాయి” అని స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO) రోహిత్ కపూర్ అన్నారు. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ విభాగం దాదాపు 18 శాతం వార్షిక వృద్ధితో సాగనుంది.

2030 నాటికి మొత్తం ఆహార సేవల విపణిలో దీని వాటా 20 శాతానికి చేరనుంది. ఇందులో ప్రస్తుతం 32-34 కోట్ల మంది వినియోగదారులు ఉండగా, 2030 నాటికి ఈ సంఖ్య మరో 11 కోట్లు పెరిగి 43-45 కోట్లకు చేరే అవకాశం ఉందని రోహిత్ తెలిపారు. ఆహార సేవల వినియోగంలో 70 శాతం వాటా 50 అగ్రశ్రేణి నగరాల నుంచే వస్తోంది. 2019 -2023 మధ్య కాలంలో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ విభాగానికి చెందిన వాటా 8 నుంచి 12 శాతానికి పెరిగింది. రానున్న రోజుల్లో టైర్ 2 పట్టణాల్లోనూ ఈ మార్కెట్ వృద్ధి జరగవచ్చని నివేదిక వెల్లడించింది.

For Latest News and National News click here

Updated Date - Jul 04 , 2024 | 10:04 AM

Advertising
Advertising