ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Paytm: పేటిఎమ్ షేర్లు కొన్న వారికి షాకింగ్ న్యూస్.. వరుసగా రెండో రోజు కూడా

ABN, Publish Date - Feb 02 , 2024 | 02:29 PM

Paytm షేర్లు కొనుగోలు చేసిన వారికి షాకింగ్ న్యూస్ తగిలింది. రెండో రోజు కూడా ఈ షేర్లు నష్టాల దిశగా కొనసాగాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే Paytm షేర్లు 20 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.

Paytm షేర్లు కొనుగోలు చేసిన వారికి షాకింగ్ న్యూస్ తగిలింది. రెండో రోజు కూడా ఈ షేర్లు నష్టాల దిశగా కొనసాగాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే Paytm షేర్లు 20 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. అంతకుముందు రోజు దాదాపు 20% క్షీణించిన తర్వాత ఈ షేరు ప్రస్తుతం రూ.487 వద్దకు చేరింది. అంతేకాదు ఈరోజు ఒకనొక సమయంలో ఆల్ టైమ్ కనిష్ట స్థాయి రూ. 438కి కూడా చేరింది. ఇది చివరిగా మార్చి 2022లో కనిపించింది.


జనవరి 31 బుధవారం నాడు Paytm షేర్ల ముగింపు ధర NSEలో 761.20గా ఉంది. నిన్న మధ్యంతర బడ్జెట్‌ రోజున షేరు ధరల్లో భారీ పతనం నమోదై షేర్లు లోయర్‌ సర్క్యూట్‌లో ప్రారంభమయ్యాయి. షేర్ ధర లోయర్ సర్క్యూట్‌లో రూ.152.20 (19.99%) పతనంతో రూ.609కి చేరింది. అయితే Paytm షేర్ల పతనానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు చుద్దాం.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: Paytm: ఆర్బీఐ ఆంక్షలపై స్పందించిన పేటీఎం.. సీఈవో ఏం చెప్పారంటే

వాస్తవానికి Paytm షేర్లలో ఈ పతనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయం తర్వాత వచ్చింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) జనవరి 31న Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై పెద్ద వ్యాపార పరిమితులను విధించింది. కొత్త డిపాజిట్లను స్వీకరించడం, క్రెడిట్ లావాదేవీలను నిర్వహించడంపై నిషేధం విధించింది.

దీంతో మరుసటి రోజు స్టాక్ మార్కెట్‌లో ఈ కంపెనీ షేర్లలో తగ్గుదల కనిపించింది. అయితే RBI.. Paytmపై ఇటువంటి నిషేధం విధించడం ఇదే మొదటిసారి కాదు. దీనికి ముందు, మార్చి 11, 2022న కొత్త కస్టమర్‌లను జోడించకుండా Paytm పేమెంట్స్ బ్యాంక్‌ని సెంట్రల్ బ్యాంక్ కట్టడిచేసింది.

RBI ప్రకారం Paytm పేమెంట్స్ బ్యాంక్ కొత్త డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు లేదా ఏదైనా కస్టమర్ ఖాతాను టాప్ అప్ చేయడానికి అనుమతించబడదు. ఇందులో ప్రీపెయిడ్ పరికరాలు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, NCMC కార్డ్‌లు కూడా ఉన్నాయి. 2024 ఫిబ్రవరి 29 తర్వాత ఈ నిబంధన అమల్లోకి వస్తుందని ఆర్‌బీఐ తెలిపింది.

Updated Date - Feb 02 , 2024 | 02:29 PM

Advertising
Advertising