Viral Video: ఐఫోన్ 16 కోసం 20 గంటలు లైన్లో వేచిఉన్న ప్రజలు
ABN, Publish Date - Sep 20 , 2024 | 09:20 AM
ఇండియాలో ఐఫోన్ 16 సిరీస్ అమ్మకాలు ప్రారంభమవుతున్నాయనే వార్త వచ్చిన వెంటనే కస్టమర్లు తమ కొత్త ఫోన్‌లను కొనుగోలు చేయడానికి స్టోర్ వెలుపల భారీగా బారులు తీరారు. ఈ క్రమంలో దేశంలోని ముంబై, ఢిల్లీలో స్టోర్ల బయట జనాలు పెద్ద ఎత్తున ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐఫోన్(iphone) 16 సిరీస్ పాపులర్ అయిన వెంటనే ఆపిల్ అభిమానుల్లో క్రేజ్ మరింత పెరిగింది. ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను సెప్టెంబర్ 9న విడుదల చేసింది. నేటి (సెప్టెంబర్ 20) నుంచి భారతదేశంలో వీటి విక్రయాలు మొదలయ్యాయి. దీంతో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు నిన్న రాత్రి నుంచే ముంబైలోని బీకేసీ యాపిల్ స్టోర్ బయట అనేక మంది క్యూలో నిల్చున్నారు. ఈ ఆపిల్ స్టోర్ ఏప్రిల్ 2023లో ప్రారంభించబడింది. ఐఫోన్ 16 కొనడానికి బీకేసీ వెలుపల వందలాది మంది గుమిగూడారు. కొంత మంది 21 గంటల పాటు లైన్‌లో నిలబడి ఉండటం విశేషం.
స్టోర్ తలుపులు తెరవగానే ఐఫోన్ 16 కొనడానికి ప్రజలు పెద్ద ఎత్తున పోటెత్తారు. రద్దీని నియంత్రించేందుకు వీలుగా లోపల, బయట గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఢిల్లీలోనూ ఐఫోన్ కొనేందుకు ప్రజల్లో విపరీతమైన ఉత్సాహం కనిపిస్తోంది. సాకేత్‌లో ఉన్న సెలెక్ట్ సిటీ వాక్‌లో ప్రజలు పొడవైన క్యూలలో నిలబడి ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే మహ్మద్ షరీక్ అనే ఓ కస్టమర్ ఐఫోన్ 16 కొనుగోలు చేసేందుకు యూపీలోని సహరాన్‌పూర్ నుంచి ఢిల్లీ వెళ్లి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఇంతకు ముందు అతను iPhone 15 Pro Maxని ఉపయోగించినట్లు తెలిపారు.
ఐఫోన్ 16 సిరీస్ ధర
iPhone 16 సిరీస్ నాలుగు మోడళ్లలో అందుబాటులో ఉంది. Apple iPhone 16 ప్రారంభ ధర రూ. 79,900, మీరు iPhone 16 Plusని రూ. 89,900కి పొందుతారు. మీరు ఐఫోన్ 16 ప్రోని కొనుగోలు చేయాలనుకుంటే దీని కోసం రూ. 1,19,900 చెల్లించాలి. ఇది కాకుండా iPhone 16 Pro Max కోసం 1,44,900 రూపాయలు పే చేయాలి.
ప్రాసెసర్
ఐఫోన్ 16 సిరీస్ ఫీచర్ల విషయానికి వస్తే అధునాతన కెమెరా ఫీచర్లు, ప్రాసెసర్, బ్యాటరీ లైఫ్ టైంకు సంబంధించి iPhone 16 సిరీస్‌లో చాలా అప్‌డేట్‌లు వచ్చాయి. ఈ ఫోన్‌లో ఇట్స్ గ్లోటైమ్ అనే AI ఫీచర్ ఉంది. దీని గురించి ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఐఫోన్ 16 బేస్ మోడల్ 48MP మెయిన్, 12MP అల్ట్రావైడ్ కెమెరాలతో వచ్చింది. iPhone 16 Pro మోడల్ 48MP మెయిన్, 48MP అల్ట్రావైడ్, 12MP 5x జూమ్ కెమెరాలను కలిగి ఉంది. దీంతో ఈ ఫోన్ మునుపటి మోడల్ కంటే మరింత మెరుగ్గా ఉందని టెక్ ప్రియులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
Stock Market: నాలుగున్నరేళ్లలో లక్షను రూ.29 లక్షలు చేసిన స్టాక్.. ఏకంగా 2818 శాతం గ్రోత్
Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే
Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు
Read MoreBusiness News and Latest Telugu News
Updated Date - Sep 20 , 2024 | 09:41 AM