ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Business Idea: సీజనల్ బిజినెస్.. తక్కువ పెట్టుబడితో నెలకు లక్షకుపైగా ఆదాయం

ABN, Publish Date - Aug 04 , 2024 | 06:43 PM

దేశంలో రుతుపవనాలు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాల(rains) కారణంగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాకాలంలో మంచి ఆదాయాన్ని ఇచ్చే ఓ వ్యాపారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సీజన్లో గ్రామాల నుంచి నగరాల వరకు విపరీతమైన డిమాండ్ ఉన్న ఉత్పత్తి రెయిన్ కోట్(Raincoat). ఈ వ్యాపారం(business) చేయడం ద్వారా ఎంత లాభం వచ్చే అవకాశం ఉంటుంది. పెట్టుబడి ఎంత అవుతుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Raincoat Business

దేశంలో రుతుపవనాలు (monsoon) వచ్చేశాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాల(rains) కారణంగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాకాలంలో మంచి ఆదాయాన్ని ఇచ్చే ఓ వ్యాపారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సీజన్లో గ్రామాల నుంచి నగరాల వరకు విపరీతమైన డిమాండ్ ఉన్న ఉత్పత్తి రెయిన్ కోట్(Raincoat). వర్షంలో తడవకుండా ఉండాలంటే మాత్రం రెయిన్ కోట్ లేదా గొడుగు తప్పకుండా ఉండాల్సిందే. దీంతో ఈ కాలంలో దాదాపు ప్రతి ఒక్కరు రెయిన్ కోట్ తీసుకోవడం తప్పనిసరిగా మారింది. అయితే ఈ వ్యాపారం(business) చేయడం ద్వారా ఎంత లాభం వచ్చే అవకాశం ఉంటుంది. పెట్టుబడి ఎంత అవుతుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


తక్కువ పెట్టుబడి

ఈ వ్యాపారాన్ని మీరు రూ.5 వేల నుంచి ప్రారంభించవచ్చు. మీరు ఈ వ్యాపారాన్ని ఎంత పెద్ద స్థాయిలో ప్రారంభించాలనుకుంటున్నారనే దానిపై లాభం కూడా ఆధారపడి ఉంటుంది. వర్షాకాలంలో రెయిన్ కోట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ వస్తువులను హోల్‌సేల్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసి స్థానిక మార్కెట్‌లో విక్రయించడం ద్వారా మీరు మంచి లాభాన్ని(profit) పొందవచ్చు. మీరు తయారీదారుల నుంచి నేరుగా ఈ వస్తువులను కూడా కొనుగోలు చేయాలి. మీరు వారి వెబ్‌సైట్‌లలో తయారీదారుల గురించి సమాచారాన్ని తెలుసుకుని నాణ్యమైన వాటిని తీసుకొచ్చి వివిధ రకాల ధరలకు విక్రయించవచ్చు.


ఆదాయం ఎంత

లేదంటే మీకు కుట్టుపని గురించి అవగాహన ఉంటే మీరు హోల్‌సేల్ మార్కెట్ నుంచి వస్తువులను కొనుగోలు చేసుకుని వచ్చి ఇంట్లోనే వీటిని సిద్ధం చేసుకోవచ్చు. తర్వాత ఆ వస్తువులను స్థానిక మార్కెట్లో విక్రయించడం ద్వారా మీరు మరింత ఎక్కువ లాభాలను పొందవచ్చు. అయితే వీటిని మీరు హోల్ సేల్(holesale) విధానంలో పెద్ద నగరాల నుంచి తీసుకుని వచ్చి మంచి లాభం వచ్చే విధంగా సేల్ చేస్తే మీకు మంచి ఆదాయం వస్తుంది.

ప్రజలు ఎక్కువగా

ప్రస్తుతం రిటైల్ మారెట్లో నాణ్యత గల మెటీరియల్ ఆధారంగా రెయిన్ కోట్ ధర రూ. 300 నుంచి రూ.2000 వరకు అమ్ముతున్నారు. వీటిని ప్రధాన నగరాల్లో ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ఒక టేబుల్ వేసుకుని రెయిన్ కోట్లను సేల్ చేస్తే సులభంగా అమ్ముడవుతాయి. ఉదాహరణకు రెండు వేల రూపాయల రెయిన్ కోట్స్ నెలకు 100 అమ్మినా కూడా ఒక దానిపై వెయ్యి లాభం వేసుకుంటే నెలకు లక్ష రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువ మొత్తంలో అమ్మితే మరింత ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది.


ఇవి కూడా చదవండి:

Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!


ITR Filing: జరిమానాతో ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల ఇన్ని నష్టాలున్నాయా..!


Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 04 , 2024 | 06:45 PM

Advertising
Advertising
<