ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Alert: వీటికి నేడే డెడ్ లైన్.. అప్‌డేట్ చేసుకున్నారా..

ABN, Publish Date - Jun 30 , 2024 | 12:45 PM

నేడు ఆదివారం(జూన్ 30) ఈ నెలలో చివరి రోజు. అయితే ఈ సందర్భంగా నేటితో ముగియనున్న ప్రత్యేక ఫైనాన్షియల్ డిపాజిట్లు, చెల్లింపుల(financial deadlines) వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

today deadlines

నేడు ఆదివారం(జూన్ 30) ఈ నెలలో చివరి రోజు. అయితే ఈ సందర్భంగా నేటితో ముగియనున్న ప్రత్యేక ఫైనాన్షియల్ డిపాజిట్లు, చెల్లింపుల(financial deadlines) వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. IDBI బ్యాంక్ సాధారణ పౌరులకు 300 రోజులలో మెచ్యూర్ అయ్యే ఉత్సవ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) 7.05%, సీనియర్ సిటిజన్‌లకు 7.55% ప్రత్యేక రేటును అందిస్తుంది. 375 రోజులలో మెచ్యూర్ అయ్యే ఉత్సవ్ FDలకు, ఇది వరుసగా 7.1%, 7.6% రేట్లను ఇస్తుంది. మరోవైపు 444 రోజులలో మెచ్యూర్ అయ్యే ఉత్సవ్ FDలకు వరుసగా 7.2%, 7.7% వడ్డీలను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వీటిని తీసుకునేందుకు నేడు చివరి అవకాశం.


2. ఇండియన్ బ్యాంక్ కూడా రెండు ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇండ్ సుప్రీం 300 డేస్, ఇండ్ సూపర్ 400 డేస్ ఉన్నాయి. వీటిని సాధారణ పౌరులకు 7.05%, సీనియర్ సిటిజన్‌లకు 7.55%, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 7.80% చొప్పున అందిస్తుంది.

3. పంజాబ్ & సింధ్ బ్యాంక్ 222 రోజులలో మెచ్యూర్ అయ్యే FDలపై 7.05%, 333 రోజులకు 7.10%, 444 రోజులకు 7.25% వడ్డీని అందిస్తున్నాయి. ఈ FDలలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ జూన్ 30, 2024గా ఉంది.


4. వ్యక్తిగత మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు లబ్ధిదారున్ని నియమించుకోడానికి లేదా వారి నామినేషన్‌ను ఉపసంహరించుకోవడానికి నేడు (జూన్ 30, 2024) చివరి రోజు. లేదంటే ఈ గడువు లోగా అప్‌డేట్ చేసుకోని మ్యూచువల్ ఫండ్ ఖాతాలు జూలై 1, 2024 నుంచి స్తంభింపజేయబడతాయి. అక్టోబర్ 1, 2022కి ముందు సృష్టించబడిన అన్ని వ్యక్తిగత మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు ఈ నియంత్రణ పరిధిలోకి వస్తాయి. స్తంభింపచేసిన ఖాతాలపై స్వాప్‌లు, రిడెంప్షన్‌లు, సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్‌లు (STPలు) వంటి లావాదేవీలు నిషేధించబడతాయి.


5. MyAadhaar సైట్‌లో ఆధార్ కార్డ్‌ని ఉచితంగా అప్‌డేట్ చేయడానికి గడువు జూన్ 14, 2024గా ఉంది. ఆ తర్వాత మీరు గుర్తింపు, చిరునామాను అప్‌డేట్ చేసుకునేందుకు రూ.50 జరిమానా చెల్లించాలి.

6. వినియోగదారుల రేషన్ కార్డుల ఈ కేవైసీ అప్‌డేట్ తేదీని జులై 31, 2024 వరకు పొడిగించినట్లు ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది. పలువురు వినియోగదారులు తమ కుటుంబ సభ్యుల వివరాలను ఈ కేవైసీలో అప్‌డేట్ చేయలేదు. అలా చేయని పక్షంలో వారి పేరు రేషన్ కార్డు నుంచి తొలగించబడుతుంది. దీంతో అటువంటి వ్యక్తుల e-KYC ప్రక్రియను పూర్తి చేయడానికి తేదీని పొడిగించారు. రేషన్ పంపిణీలో పారదర్శకతను తీసుకురావడానికి రేషన్ కార్డులో నమోదు చేయబడిన వ్యక్తుల పేరు, పుట్టిన తేదీ, లింగం ఆధార్‌లో నమోదు చేయబడిన డేటాతో సరిపోలుతున్నాయని ఈ-కేవైసీ ద్వారా డిపార్ట్‌మెంట్ నిర్ధారిస్తుంది.


ఇది కూడా చదవండి:

Gold and Silver Prices: బంగారం కొనాలని చుస్తున్నారా..ఈ ధరలు తెలుసుకోండి మరి

ఎస్‌బీఐ కొత్త చైర్మన్‌గా తెలుగు తేజం


పోస్ట్‌ సేల్‌ డిస్కౌంట్‌పై జీఎ్‌సటీ సర్దుబాటు ఎలా..?


For Latest News and Business News click here

Updated Date - Jun 30 , 2024 | 12:48 PM

Advertising
Advertising