ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

RBI : ఫారెక్స్‌ నిల్వలు @70,000 కోట్ల డాలర్లు

ABN, Publish Date - Oct 05 , 2024 | 03:21 AM

భారత విదేశీ మారక (ఫారెక్స్‌) నిల్వలు సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయికి పెరిగాయి. సెప్టెంబరు 27తో ముగిసిన వారంలో ఫారెక్స్‌ నిల్వలు ఏకంగా 1,258.8 కోట్ల డాలర్ల వృద్ధితో మొత్తం 70,488.5 కోట్ల డాలర్లకు చేరుకున్నట్లు ఆర్‌బీఐ శుక్రవారం వెల్లడించింది.

  • సరికొత్త రికార్డు గరిష్ఠానికి చేరిక

  • వరుసగా 7 వారాలుగా అప్‌..

  • ఈ స్థాయి నిల్వలు కలిగిన నాలుగో దేశంగా భారత్‌

భారత విదేశీ మారక (ఫారెక్స్‌) నిల్వలు సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయికి పెరిగాయి. సెప్టెంబరు 27తో ముగిసిన వారంలో ఫారెక్స్‌ నిల్వలు ఏకంగా 1,258.8 కోట్ల డాలర్ల వృద్ధితో మొత్తం 70,488.5 కోట్ల డాలర్లకు చేరుకున్నట్లు ఆర్‌బీఐ శుక్రవారం వెల్లడించింది. ఈ నిల్వలు 70,000 కోట్ల డాలర్ల మైలురాయిని దాటడం ఇదే తొలిసారి. అంతేకాదు, ఇప్పటివరకు నమోదైన అత్యధిక వారం రోజుల నిల్వ వృద్ధిలో ఇదొకటి. అలాగే, ఫారెక్స్‌ నిల్వలు వరుసగా ఏడు వారాలుగా వృద్ధి చెందుతూ వస్తున్నాయి.

గత నెల 20తో ముగిసిన వారంలోనూ నిల్వలు 283 కోట్ల డాలర్ల మేర పెరిగాయి. ఏడు వారాల్లో నిల్వలు 3,476.7 కోట్ల డాలర్ల మేర పెరగగా.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 8,760 కోట్ల డాలర్ల మేర వృద్ధి చెందాయి. గత ఏడాది మొత్తానికి పెరిగిన 6,200 డాలర్ల కన్నా అధికమిది. 2026 మార్చి నాటికి భారత విదేశీ మారక నిల్వలు 74,500 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోవచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా అంచనా వేసింది. కాగా, ప్రపంచంలో 70,000 కోట్ల డాలర్లకు పైగా ఫారెక్స్‌ నిల్వలు కలిగిన చైనా, జపాన్‌, స్విట్జర్లాండ్‌ తర్వాత నాలుగో దేశంగా భారత్‌ అవతరించింది. ఆకస్మిక అంతర్జాతీయ షాక్‌ల నుంచి తట్టుకునేందుకు మన ప్రభుత్వం 2013 నుంచి నిల్వలను క్రమంగా పెంచుకుంటూ వస్తోంది.

Updated Date - Oct 05 , 2024 | 03:21 AM