Bank Holidays: ఫిబ్రవరిలో బ్యాంకులు 18 రోజులే పనిచేస్తాయి.. సెలవుల లిస్ట్ ఇదే..
ABN, Publish Date - Feb 01 , 2024 | 10:53 AM
కొత్త ఏడాది 2024లో అప్పుడే ఒక నెల గడిచిపోయింది. జనవరి ముగిసిపోయి ఫిబ్రవరి వచ్చేసింది. ఈ ఏడాది లీప్ సంవత్సరం కావడంతో ఫిబ్రవరిలో 29 రోజులు ఉన్నాయి.
కొత్త ఏడాది 2024లో అప్పుడే ఒక నెల గడిచిపోయింది. జనవరి ముగిసిపోయి ఫిబ్రవరి వచ్చేసింది. ఈ ఏడాది లీప్ సంవత్సరం కావడంతో ఫిబ్రవరిలో 29 రోజులు ఉన్నాయి. కాబట్టి ఫిబ్రవరి నెలలో బ్యాంక్ కు సంబంధించిన పనులు ఏమైనా ఉంటే వాటిని త్వరగా పూర్తిచేసుకోవడం మంచిదని అధికార వర్గాలు చెబుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో వివిధ రోజుల్లో పనిదినాలు ఉన్నాయని, కొన్ని రోజులు బ్యాంకులకు సెలవు ఉంటుందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్బీఐ ) విడుదల చేసిన రిపోర్టులో వెల్లడించింది. వారాంతపు సెలవులు, జాతీయ, ప్రాంతీయ పండుగలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పరిస్థితులు కూడా ఈ సెలవులపై ప్రభావం చూపుతాయని తెలిపింది.
ఫిబ్రవరి 4న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఫిబ్రవరి 10 రెండో శనివారంతో పాటు గ్యాంగ్ టక్ లో జరుపుకునే లోనర్ పండుగ, ఫిబ్రవరి 11 ఆదివారం, ఫిబ్రవరి 14 న వసంత పంచమి సందర్భంగా పశ్చిమ బెంగాల్, త్రిపుర, ఒడిశా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఫిబ్రవరి 15న మణిపూర్‌లో బ్యాంకులకు సెలవు ఉంటాయి. ఫిబ్రవరి 18 ఆదివారం, ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ జయంతి, ఫిబ్రవరి 20 అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి ముఖ్యమైన డిజిటల్ సేవలకు ఈ సెలవుల నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ సేవలు అందరికీ అందుబాటులో ఉంటాయి. మన దేశంలో బ్యాంకు సెలవులను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టం 1881 కింద నిర్ణయించారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించే బ్యాంకు సెలవుల క్యాలెండర్‌ను అన్ని బ్యాంకులు పాటిస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 01 , 2024 | 10:53 AM