ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొత్త ఏడాది ఐటీలో నియామకాల జోరు

ABN, Publish Date - Dec 25 , 2024 | 04:52 AM

ఈ సంవత్సరం (2024) దేశీయ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ (ఐటీ) రంగానికి చేదు అనుభవమే మిగిల్చింది. రాజకీయ, ఆర్థిక అనిశ్చితితో అమెరికా, యూరోపియన్‌ కంపెనీలు ఐటీ ఖర్చులు తగ్గించేశాయి. దాంతో ఈ దేశాల నుంచి...

డేటా సైన్స్‌, ఏఐ నిపుణులదే హవా

  • ద్వితీయ శ్రేణి నగరాల వైపు కంపెనీల చూపు

  • 2024లో 7% తగ్గిన నియామకాలు

ఈ సంవత్సరం (2024) దేశీయ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ (ఐటీ) రంగానికి చేదు అనుభవమే మిగిల్చింది. రాజకీయ, ఆర్థిక అనిశ్చితితో అమెరికా, యూరోపియన్‌ కంపెనీలు ఐటీ ఖర్చులు తగ్గించేశాయి. దాంతో ఈ దేశాల నుంచి భారత కంపెనీలకు వచ్చే ఐటీ ప్రాజెక్టులు తగ్టిపోయాయి. ఈ దెబ్బతో దేశీయ ఐటీ కంపెనీల్లో గత ఏడాది (2023)తో పోలిస్తే ఈ ఏడాది నియామకాల జోరు 7 శాతం తగ్గింది. ఇది కూడా గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఆదుకోబట్టి మాత్రమే సాధ్యమైంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు జరిగిన ఐటీ కొలువుల నియామకాల్లో 52.6 శాతం వాటా జీసీసీలదే. కొత్త ప్రాజెక్టులు పెద్దగా రాకపోవడంతో ఐటీ కంపెనీలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు భారీగా తగ్గించాయి. కొన్ని కంపెనీలైతే ఎంపికైన అభ్యర్థులకు ఇచ్చిన ఆఫర్‌ లెటర్లనీ ఏదో ఒక పేరుతో వెనక్కి తీసుకున్నాయి. లేదా ఉలుకూ పలుకూ లేకుండా సస్పెన్షన్‌లో పెట్టాయి. దీంతో ప్రముఖ ఐటీ కంపెనీలు కూడా 2023తో పోలిస్తే ఈ ఏడాది ఫ్రెషర్ల నియామకాలు రెండు నుంచి 15 శాతం మాత్రమే పెంచాయి.


కొందరికే డిమాండ్‌

ఈ సంవత్సరం ఐటీ రంగంలో నియామకాలు తగ్గినా కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్‌ వంటి డొమైన్స్‌లో పట్టున్న నిపుణులకు మాత్రం మంచి అవకాశాలే లభించాయి. ఈ నైపుణ్యాలు ఉన్న ఉద్యోగుల నియామకాలు గత ఏడాదితో పోలిస్తే 2024లో 39ు పెరిగాయి. ఈ డొమైన్స్‌లో పట్టున్న నిపుణులు దొరక్క చాలా ఐటీ కంపెనీలు ఉన్న ఉద్యోగులకే పెద్దఎత్తున శిక్షణ ఇస్తున్నాయి. ఇక మంచి అనుభవం ఉన్న మధ్య, సీనియర్‌ స్థాయి ఉద్యోగుల నియామకాలూ గత ఏడాదితో పోలిస్తే 35ు పెరిగాయి.


మారిన కంపెనీల వైఖరి

ఐటీ కంపెనీల వైఖరిలోనూ మార్పు కనిపిస్తోంది. గతంలో ఈ కంపెనీలు బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై వంటి మెట్రో నగరాలపైనే దృష్టి పెట్టేవి. ఇవే కంపెనీలు ఇప్పుడు ద్వితీయ శ్రేణి నగరాలపైనా దృష్టి పెడుతున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు స్థానికంగా నిపుణులైన ఉద్యోగులు పుష్కలంగా దొరకడమూ ఇందుకు కారణం. దీంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబరు త్రైమాసికంలో ద్వితీయ శ్రేణి నగరాల్లోని ఐటీ కంపెనీల నియామకాలు 48 శాతం పెరిగాయి.

ఆశలన్నీ 2025పైనే

భారత ఐటీ కంపెనీలకు 2025 సంవత్సరం మాత్రం ఆశావహంగానే కనిపిస్తోంది. అతిపెద్ద మార్కెట్‌ అయిన అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ముగియడం, యూరోపియన్‌ ఆర్థిక వ్యవస్థలు గాడినపడటం ఇందుకు ప్రధాన కారణం. దీంతో వచ్చే జనవరి నుంచి పెద్ద కంపెనీలకు మళ్లీ ప్రాజెక్టుల రాక పెరుగుతుందని టీమ్‌ లీజ్‌ ఎడ్‌టెక్‌ సీఓఓ జైదీప్‌ కేవల్‌రమణి చెప్పారు. ఆ తర్వాత చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టులూ పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఐటీ కంపెనీలు ఇప్పటికే డేటా సైన్స్‌, ఏఐ, ఎంఎల్‌ నిపుణుల కోసం అన్వేషణ ప్రారంభించాయి. వ్యాపార అవకాశాలను దొరక పుచ్చుకోవాలంటే ఏఐ వంటి అధునాతన టెక్నాలజీలను వేగంగా అందిపుచ్చుకోక తప్పదని విప్రో చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సీటీఓ) సంధ్యా అరుణ్‌ చెప్పడం విశేషం.


ఈ విషయంలో ఏ మాత్రం వెనకబడ్డా ఐటీ రంగంలో మనగలగడం కష్టమన్నారు. దీంతో ఈ అధునాతన టెక్నాలజీపై పట్టున్న నిపుణుల నియామకాలు గత ఏడాదితో పోలిస్తే 2025లో 30 నుంచి 35 శాతం వరకు పెరుగుతాయని మార్కెట్‌ వర్గాల అంచనా. ఐటీ పరిశ్రమ మొత్తంగా చూసినా 2025లో నియామకాలు 15 నుంచి 20 శాతం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఏఐ, ఎంఎల్‌ టెక్నాలజీల కారణంగా ఐటీ రంగంలో కొన్ని ఉద్యోగాలు మాయమయ్యే ప్రమాదమూ పొంచి ఉంది.

Updated Date - Dec 25 , 2024 | 04:52 AM