SME IPO: ఐపీఓ క్రేజ్ ఆ స్థాయిలో ఉంది మరి.. కేవలం రెండు షోరూమ్‌లు ఉన్న కంపెనీ కోసం భారీ పోటీ..!
ABN, Publish Date - Aug 27 , 2024 | 08:46 PM
దేశ రాజధాని ఢిల్లీలో రెండే షోరూమ్‌లు.. కేవలం ఎనిమిది మాత్రమే ఉద్యోగులు.. కంపెనీ పేరు రిసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్.. 2018లో మొదలైన ఈ సంస్థ సాహ్ని ఆటోమొబైల్ బ్రాండ్‌పై వ్యాపారం చేస్తుంది. యమహా కంపెనీకి చెందిన వాహనాల డీలర్ షిప్ ఉంది. బైక్‌ల సేల్స్, సర్వీసింగ్ పనులు చేస్తుంటుంది.
దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో రెండే షోరూమ్‌లు.. కేవలం ఎనిమిది మాత్రమే ఉద్యోగులు.. కంపెనీ పేరు రిసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్.. 2018లో మొదలైన ఈ సంస్థ సాహ్ని ఆటోమొబైల్ బ్రాండ్‌పై వ్యాపారం చేస్తుంది. యమహా కంపెనీకి చెందిన వాహనాల డీలర్ షిప్ ఉంది. బైక్‌ల సేల్స్, సర్వీసింగ్ పనులు చేస్తుంటుంది. ఢిల్లీలోనే మరో రెండు షోరూమ్‌లు తెరవడం కోసం పెట్టుబడి నిధులు సమీకరించుకోవాలనుకుంది. అందుకోసం స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (SME) సెగ్మెంట్‌లో ఐపీవో (IPO)కు రావాలనుకుంది. సెబీ నుంచి ఐపీఓకు అనుమతి లభించింది. ఇప్పుడు ఆ ఐపీఓ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది (Resourceful Automobile IPO).
ఐపీఓలో భాగంగా 10.25 లక్షల ఈక్విటీ షేర్లను ఒక్కొక్క షేరు రూ.117 చొప్పున సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉంచింది. ఈ నెల 22 నుంచి 26 వరకు సబ్‌స్క్రిప్షన్ జరిగింది. ఈ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. కేవలం రూ.12 కోట్ల ఐపీఓకు ఏకంగా రూ.4,800 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. రిసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్ కంపెనీ ఏకంగా 419 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. నాన్- ఇన్‌స్టిట్యూషన్ ఇన్వెస్టర్ పోర్షన్ 315.61 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ పోర్షన్ 496.22 రెట్లకు సమానమైన బిడ్లు దాఖలయ్యాయి. ఆగస్ట్ 29వ తేదీన బీఎస్‌ఈ ఎస్‌ఎమ్‌ఈ ప్లాట్‌ఫామ్‌పై ఈ కంపెనీ లిస్ట్ కాబోతోంది.
ఇటీవలి కాలంలో ఐపీఓలకు భారీ డిమాండ్ కనబడుతోంది. లిస్టింగ్ రోజున వచ్చే లాభాల కోసమే చాలా మంది ఐపీఓల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం బుల్ మార్కెట్ ట్రెండ్ నడుస్తుండడంతో చాలా సంస్థలు లిస్టింగ్ రోజున ఇన్వెస్టర్లకు భారీ లాభాలను పంచుతున్నాయి. తమకు షేర్లు అలాట్ అయితే లిస్టింగ్ రోజున అమ్మేసుకొని లాభాలు చేసుకోవచ్చని చాలా మంది భావిస్తున్నారు. అయితే ఈ క్రమంలో కొందరు భారీ నష్టాలను కూడా మూటగట్టుకుంటున్నారు. ఐపీఓ వివరాల్లోకి కూడా వెళ్లకుండా చాలా మంది బిడ్లు దాఖలు చేస్తుండడం మార్కెట్ నిపుణులను ఆందోళనకు గురి చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
Zee Entertainment: జీ-సోనీ మధ్య ఏకాభిప్రాయం.. భారీగా పెరిగిన జీ ఎంటర్‌టైన్మెంట్ స్టాక్..!
Stock Market: ఆరంభ లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ సూచీలు..!
YouTube: యూజర్లకు షాకిచ్చిన యూట్యూబ్.. ఈ ప్లాన్‌ల ధరలు పెంపు
Business Idea: రూ. 15 వేల పెట్టుబడితో వ్యాపారం .. నెలకు రూ.50 వేలకుపైగా ఆదాయం
Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Aug 27 , 2024 | 08:46 PM