Birla: ప్రస్తుతం వ్యాపారం స్టార్ట్ చేయాలంటే రూ.కోటి చాలదు: కుమార్ మంగళం బిర్లా
ABN, Publish Date - Dec 22 , 2024 | 10:42 PM
ఈ రోజులున్నా రూ.కోటి రూపాయలున్నా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించలేమని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో రూ.కోటి రూపాయలున్నా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించలేమని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా అన్నారు. నిఖిల్ కామత్ నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన తన వ్యాపార దృక్పథం ప్రస్తుత కాలమాన పరిస్థితులపై తన అభిప్రాయాలను పంచుకున్నారు (Business).
Next Week IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని కంపెనీలంటే..
తన దృష్టిలో నాయకత్వం మూలాలు నమ్మకం, క్రమశిక్షణలో ఉన్నాయని కుమార్ మంగళం బిర్లా అన్నారు. భారీ సంస్థల్లో ఉద్యోగుల బాగోగులపై దృష్టిపెట్టాలని చెప్పారు. ప్రస్తుతం తన సంస్థల్లో 1.8 లక్షల మంది పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక తనకు కోపం ఎన్ని సార్లో హద్దులు దాటిందో కూడా లెక్కపెట్టుకుంటానని బిర్లా చెప్పుకొచ్చారు. మేనేజ్‌మెంట్ సూత్రాల్లో ఇదీ ఒక భాగమని అన్నారు. తన 29 కెరీర్‌లో కేవలం 18 సార్లు మాత్రమే కోపం హద్దులు దాటిందని అన్నారు. కార్పొరేట్ ప్రపంచంలో కోపానికి అర్థం మనకు పరిస్థితులపై అదుపులేనట్టేనని ఆయన వ్యాఖ్యానించారు.
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
బాధ్యతలను ఇతరులకు అప్పగించే విషయంలో నమ్మకమే కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకొచ్చారు. బయటివారిని సంస్థల్లో కీలక స్థానాల్లో నియమించుకునే క్రమంలో తన మనసు చెప్పిందే వింటానని అన్నారు. మంచి టీం తయారు చేసుకోవాలంటే ఏదో సాధించాలన్న తపన ఉండాలని చెప్పారు. మంచి అనుభవం ఉన్న వారిని ఒక్కాతాటిపైకి తేవాలన్న తపన ఉండాలని అన్నారు.
తను ఎంచుకున్న రంగాల్లో తొలిస్థానానికి చేరడమే తన వ్యాపారదృక్కోణమని బిర్లా చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో తాము తొలి రెండు స్థానాల్లో ఉండే అవకాశం ఉన్న రంగాల్లోకే ప్రవేశిస్తామని వివరించారు. భారీ వ్యాపారాలు ముందుకు సాగేందుకున్న ఒకే ఒక మార్గం సృజనాత్మకత అని ఆయన చెప్పుకొచ్చారు. సులభమైన అంశాలను ఇతరులు ఎప్పుడో తమకు అనుకూలంగా వాడేసుకుని ఉంటారని అభిప్రాయపడ్డారు. వ్యాపారం విస్తరించే కొద్దీ మేనేజమెంట్ శైలి కళ నుంచి సైన్స్‌గా రూపాంతరం చెందుతుందని అన్నారు. ఏపనైనా వదలిపెట్టకుండా కొనసాగించడమే దీర్ఘకాలిక విజయాలను అందిస్తుందని చెప్పారు.
ప్రస్తుత స్టార్టప్ రంగం తీరుతెన్నులను ప్రస్తావించిన ఆయన ఇప్పుడు ఏ కొత్త వ్యాపారం ప్రారంభించేందుకైనా రూ.కోటి కూడా చాలదని అభిప్రాయపడ్డారు.
Read More Business News and Latest Telugu News
Updated Date - Dec 22 , 2024 | 10:50 PM