Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్

ABN, Publish Date - Aug 02 , 2024 | 02:37 PM

మీరు రిస్క్ లేకుండా కొన్నేళ్లపాటు కొంత మొత్తాన్ని పెట్టుబడి(investment) పెట్టి గరిష్ట లాభాలను ఆర్జించాలని చుస్తున్నారా. అయితే మీకోసం రెండు ప్రభుత్వ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో పొదుపు చేయడం ద్వారా ఎలాంటి రిస్క్(no risk) ఉండదు. అందుకోసం SBI FD, పోస్టాఫీసు కిసాన్ వికాస్ పత్ర (KVP) పథకాలు ఉన్నాయి. అయితే వీటిలో దేనిలో 5 లక్షల రూపాయలు 10 ఏళ్లపాటు పొదుపు చేస్తే లాభం ఉంటుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్
SBI Fd Vs KVP which is best

మీరు రిస్క్ లేకుండా కొన్నేళ్లపాటు కొంత మొత్తాన్ని పెట్టుబడి(investment) పెట్టి గరిష్ట లాభాలను ఆర్జించాలని చుస్తున్నారా. అయితే మీకోసం రెండు ప్రభుత్వ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో పొదుపు చేయడం ద్వారా ఎలాంటి రిస్క్(no risk) ఉండదు. దీంతోపాటు మీకు రిటర్స్న్ కూడా తప్పనిసరిగా వస్తాయి. అందుకోసం SBI FD, పోస్టాఫీసు కిసాన్ వికాస్ పత్ర (KVP) పథకాలు ఉన్నాయి. అయితే వీటిలో దేనిలో 5 లక్షల రూపాయలు 10 ఏళ్లపాటు పొదుపు చేస్తే లాభం ఉంటుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


SBIలో ఎంత రాబడి

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా FDలో 10 సంవత్సరాల పాటు రూ. 5,00,000 పెట్టుబడి పెడితే, మీకు 10 సంవత్సరాల FDపై 6.5 శాతం నుంచి 7.5 శాతం వరకు వడ్డీ ఇవ్వబడుతుంది. ఈ లెక్కన చూసుకుంటే 6.5 శాతం వద్ద మీరు 10 సంవత్సరాలలో రూ. 4,52,779 వడ్డీని పొందుతారు. ఈ విధంగా మీరు పెట్టిన ఐదు లక్షలు కలుపుకుని మొత్తం మెచ్యూరిటీ రూ.9,52,779 అవుతుంది. అయితే స్టేట్ బ్యాంక్‌లో 10 సంవత్సరాల ఎఫ్‌డీపై వృద్ధులకు 1% వడ్డీ ఎక్కువగా ఇవ్వబడుతుంది. అంటే వృద్ధులకు 7.50% చొప్పున వడ్డీ లభిస్తోంది. ఈ సందర్భంలో వీరు 10 సంవత్సరాలలో రూ. 5,51,175 వడ్డీని పొందుతారు. ఈ క్రమంలో వారు పెట్టిన మొత్తం 5 లక్షల దాదాపు పెట్టింపు అయ్యి రూ. 10,51,175 చేరుకుంటుంది.


కేవీపీలో ఎంత

కిసాన్ వికాస్ పత్రలో 115 నెలల్లో అంటే 9 సంవత్సరాల 7 నెలల్లో మొత్తాన్ని రెట్టింపు చేసే హామీ ఉంది. ప్రస్తుతం కేవీపీలో 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు దీనిలో డబ్బును పెట్టుబడి పెట్టినట్లయితే 9 సంవత్సరాల 7 నెలల తర్వాత మీరు మెచ్యూరిటీ మొత్తం రూ. 10,00,000లకు చేరుకుంటుంది. ఇక పన్ను ప్రయోజనాల గురించి మాట్లాడినట్లయితే 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉన్న FDలు 80C కింద పన్ను ప్రయోజనాలను పొందుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు SBI FDలో 80C ప్రయోజనం పొందుతారు. కానీ పోస్ట్ ఆఫీస్ KVPలో ఎటువంటి పన్ను ప్రయోజనం అందుబాటులో ఉండదు.


ఏది బెస్ట్

అయితే ఈ రెండింటి లెక్కలను పరిశీలిస్తే సాధారణ వ్యక్తులు SBI FDలో పెట్టుబడి పెడితే వారు 10 సంవత్సరాల పాటు మొత్తాన్ని డిపాజిట్ చేసిన తర్వాత తక్కువ లాభాన్ని పొందుతారు. అయితే KVPలో వారికి మంచి వడ్డీతోపాటు రెట్టింపు లాభం వస్తుంది. కాబట్టి వారికి ఇదే బెటర్ అని చెప్పవచ్చు. కానీ వృద్ధులకు SBI FD, KVP రెండింటిలోనూ 7.5 శాతం వడ్డీనే ఇస్తారు. వృద్దులకు కేవీపీలో 9 ఏళ్ల 7 నెలల్లో రూ.10 లక్షలు వస్తాయి. వీరు మొత్తం 10 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టగలిగితే వారు SBIని ఎంచుకోవచ్చు. ఎందుకంటే దీనిలో 10 ఏళ్లలో రూ.10,51,175 వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేవీపీతో పోల్చితే రూ. SBIలో 51,000 ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.


ఇవి కూడా చదవండి:

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..


ITR Filling: ఐటీఆర్ దాఖలుకు నేడే లాస్ట్ ఛాన్స్.. గడువు పెంచుతారా, క్లారిటీ

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 02 , 2024 | 02:40 PM

Advertising
Advertising
<