SBI Debit Cards: ఎస్‌బీఐ డెబిట్ కార్డు వినియోగదారులకు కీలక అప్‌డేట్
ABN, Publish Date - Mar 27 , 2024 | 08:37 PM
నూతన ఆర్థిక సంవత్సరం 2024-25 ఆరంభం కానున్న నేపథ్యంలో పలు ఆర్థిక సంబంధ నిబంధనలు మారబోతున్నాయి. తాజాగా ప్రభుత్వరంగ బ్యాకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ కూడా కీలక అప్‌డేట్ ఇచ్చింది. పలు డెబిట్ కార్డ్‌లపై వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచుతున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ మేరకు సవరించిన కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1, 2024 నుంచి అమల్లోకి వస్తాయని వివరించింది.
నూతన ఆర్థిక సంవత్సరం 2024-25 ఆరంభం కానున్న నేపథ్యంలో పలు ఆర్థిక సంబంధ నిబంధనలు మారబోతున్నాయి. తాజాగా ప్రభుత్వరంగ బ్యాకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ (SBI) కూడా కీలక అప్‌డేట్ ఇచ్చింది. పలు డెబిట్ కార్డ్‌లపై వార్షిక నిర్వహణ ఛార్జీలను (annual maintenance charges) పెంచుతున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ మేరకు సవరించిన కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1, 2024 నుంచి అమల్లోకి వస్తాయని వివరించింది.
ఎస్‌బీఐ క్లాసిక్ డెబిట్ కార్డుల జాబితాలోని క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్‌లపై యాన్యూవల్ మెయింటినెన్స్ ఛార్జీ ప్రస్తుతం రూ.125గా ఉండగ దానిని రూ.200లకు పెంచినట్టు ఎస్‌బీఐ వెల్లడించింది. ఇక యువ కార్డుల జాబితాలోని యువా, గోల్డ్, కాంబో డెబిట్ కార్డ్, మై కార్డ్ (ఇమేజ్ కార్డ్) వంటి డెబిట్ కార్డులపై వార్షిక నిర్వహణ ఛార్జి ప్రస్తుతం రూ.175గా ఉండగా రూ.250కి పెంచింది. వీటికి జీఎస్టీ అదనంగా యాడ్ అవుతుంది.
ఎస్‌బీఐ ప్లాటినం డెబిట్ కార్డుపై వార్షిక నిర్వహణ ఛార్జీ ప్రస్తుతం రూ.250గా ఉండగా దానిని రూ.325కి పెంచింది. ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డుపై ప్రస్తుతం రూ.350గా ఉన్న వార్షిక నిర్వహణ ఛార్జీని రూ.425కి పెంచింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 27 , 2024 | 08:49 PM