SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యూ3లో SBIకి రూ.4592 కోట్ల నష్టం..కారణమిదే
ABN, Publish Date - Feb 03 , 2024 | 05:06 PM
దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లాభాలు భారీగా పతనమయ్యాయి. శనివారం ప్రకటించిన FY24 క్యూ3 త్రైమాసికంలో SBI లాభం ఏకంగా 35 శాతం కోల్పోయి రూ. 9,163 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించారు.
దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లాభాలు భారీగా పతనమయ్యాయి. శనివారం ప్రకటించిన FY24 క్యూ3 త్రైమాసికంలో SBI లాభం ఏకంగా 35 శాతం కోల్పోయి రూ. 9,163 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించారు. అయితే ఇది గత సంవత్సరంతో పోల్చితే రూ.4592 కోట్లు తక్కువగా ఉండటం విశేషం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రితం సంవత్సరం రూ. 14,205 కోట్లు లాభాలను ఆర్జించింది. అధిక పెన్షన్ ఖర్చులు, సిబ్బంది వేతన సవరణల కోసం రూ.7,100 కోట్లు ఖర్చయిన నేపథ్యంలో లాభం తగ్గిందని SBI తెలిపింది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: AP employees: ఈనెలా అదే పరిస్థితా?... జీతాలు మహాప్రభో అంటున్న ఏపీ ఉద్యోగులు
మరోవైపు క్యూ3 ఎఫ్‌వై24లో రూ. 105,733.78 కోట్ల వడ్డీ ఆదాయం ఆర్జించిందని, ఇది క్రితం ఏడాది కాలంలో నమోదైన రూ.86,616.04 కోట్లతో పోలిస్తే 22 శాతం పెరిగిందని బ్యాంక్ పేర్కొంది. దేశంలోని అతిపెద్ద బ్యాంకు నికర వడ్డీ ఆదాయం (NII) ఈ త్రైమాసికంలో రూ.39,815 కోట్లుగా ఉంది. పబ్లిక్ లెండర్ అయినప్పటికీ FY24 మొదటి తొమ్మిది నెలలకు స్టాండ్‌లోన్ నికర లాభం రూ. 40,378 కోట్లుగా ఉంది. ఇది Q3 FY23లో రూ. 33,538 కోట్ల నుంచి 20.40 శాతానికి పెరిగింది.
Updated Date - Feb 03 , 2024 | 05:07 PM