ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Business Idea: జస్ట్ రూ.10 వేల పెట్టుబడితో వ్యాపారం.. నెలకు రూ. 50 వేలకుపైగా ఆదాయం..

ABN, Publish Date - Oct 21 , 2024 | 05:07 PM

మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంతో వీసిగిపోయారా. ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారా. అయితే తక్కువ పెట్టుబడితో చేసే ఓ బిజినెస్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈ వ్యాపారంలో మీరు నెలకు 50 వేలకుపైగా సంపాదించుకోవచ్చు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.

Business Idea

మీరు తక్కువ డబ్బుతో వ్యాపారం చేయాలని భావిస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇక్కడ చెప్పబోయేది కూడా తక్కువ పెట్టుబడితో చేసే బిజినెస్. అదే వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చేసే వ్యాపారం. చెత్త బిజినెస్ అని తక్కువగా అంచనా వేయకుండి. ఎందుకంటే ప్రస్తుతం ఈ వ్యాపారానికి మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. స్క్రాప్ రీసైక్లింగ్ వ్యాపారం స్పెషల్ ఏమిటంటే, దీనిలో అవసరమైన పెట్టుబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఈ వ్యాపారంలో దాదాపు 10 నుంచి 15 వేల రూపాయలు పెట్టుబడి పెడితే చాలు. మంచి లాభాలను ఆర్జించవచ్చు. అయితే ఈ వ్యాపారం ఎలా ప్రారంభించాలి, అందుకోసం ఏం చేయాలి, లాభాలు ఎలా ఉంటాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


ఫుల్ డిమాండ్

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 2 బిలియన్ టన్నుల కంటే ఎక్కువగా స్క్రాప్ ఉత్పత్తి అవుతుంది. ఇక భారతదేశం విషయానికి వస్తే ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం 277 మిలియన్ టన్నులకు పైగా స్క్రాప్ ఉత్పత్తి అవుతుంది. ఈ క్రమంలో మీరు ఈ స్క్రాప్ నుంచి మీకు వచ్చిన వస్తువులను ఎంపిక చేసుకుని వాటి నుంచి అనేక రకాల వస్తువులు తయారు చేసుకోవచ్చు.

మెటల్ స్క్రాప్‌

ఉదాహరణకు ప్లాస్టిక్ అలంకార వస్తువులు, కుర్చీలు, బల్లలు, కుండలు, ఆభరణాలు, పెయింటింగ్‌లు, బ్యాగులు వంటి వాటిని స్క్రాప్‌తో రూపొందించుకోవచ్చు. ఈ క్రమంలో మీరు మెటల్ స్క్రాప్‌ను కూడా ఎంచుకోవచ్చు. వీటిలో అల్యూమినియం, ఇనుము, రాగి, ఇత్తడి వంటి ఇతర లోహాలు వస్తాయి. రీసైక్లింగ్ తర్వాత వీటిని మీరు కొత్త ఉత్పత్తులను రూపొందించడానికి ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత ప్రాసెస్ చేసిన ఉత్పత్తులను విక్రయించుకుని లాభాలను గడించవచ్చు.


ఆదాయం ఎంత

రీసైక్లింగ్ జంక్ నుంచి తయారైన వస్తువులకు తక్కువ ధర ఉండటం వల్ల అనేక మంది కొనుగోలు చేస్తున్నారు. రీసైక్లింగ్ ఇనుము వంటి పరికరాలను ఇతర వాహనాలకు కూడా ఉపయోగిస్తారు. ఇక ప్లాస్టిక్ ద్వారా కొత్త ఉత్పత్తుల కూడా తయారు చేస్తారు. ఇందులో కుర్చీలు, బల్లలు, సహా ఇతర అలంకార వస్తువులు ఉంటాయి. ఈ క్రమంలో అనేక మంది వ్యాపారస్తులు కూడా వీటిని హోల్ సేల్ విధానంలో కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో విక్రయించి వ్యాపారం చేస్తారు. దీన్ని బట్టి స్క్రాప్ వ్యాపారంలో ఎంత లాభం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఆయా వస్తువులను సేల్ చేయడం ద్వారా నెలకు రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించుకోవచ్చు.


ఎలా ప్రారంభించాలి?

మీరు కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ముందుగా మీ పరిసర ప్రాంతాల నుంచి వ్యర్థ పదార్థాలను సేకరించుకోవాలి. లేదంటే మీరు మున్సిపల్ కార్పొరేషన్‌ని కూడా సంప్రదించి వారి నుంచి తీసుకోవచ్చు. ఆ క్రమంలో మీకు ఏ రకమైన స్క్రాప్ అవసరం కావాలనేది మాట్లాడుకుని నిర్ణయించుకోవాలి. మీరు స్క్రాప్ శుభ్రం చేసి ఆపై విభిన్న వస్తువులను తయారు చేసుకోవాలి. ఉత్పత్తి అయిన వస్తువులను మీరు దానిని ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ మార్కెట్‌లలో విక్రయించవచ్చు. మీరు చేసే ఉత్పత్తులను బట్టి లాభాలు ఆధారపడి ఉంటాయి. ఇనుము వంటి పరికరాలకు ఎక్కువ లాభాలు వస్తాయి. ప్లాస్టిక్ వంటి వాటికి కొంచెం తక్కువ లాభాలు ఉంటాయి.


ఇవి కూడా చదవండి:

Pension Plan: రోజూ రూ. 12 ఆదా చేస్తే.. 60 ఏళ్ల తర్వాత నెలకు ఎంత పెన్షన్ వస్తుందంటే..

Muhurat Trading 2024: ఈసారి దీపావళి ముహూరత్ ట్రేడింగ్ ఎప్పుడంటే.. అక్టోబర్ 31 లేదా నవంబర్ 1..


Missed Call: మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ మిస్డ్ కాల్ ఇచ్చి ఇలా చెక్ చేసుకోండి..


Personal Finance: మహిళలకు గుడ్ న్యూస్.. రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు..



Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 21 , 2024 | 05:21 PM