ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Next Week IPOs: వచ్చే వారం ఆరు ఐపీఓలు సిద్ధం..అవేంటో చూద్దాం

ABN, Publish Date - Jan 28 , 2024 | 01:42 PM

దేశీయ స్టాక్ మార్కెట్లో మళ్లీ IPOల జాతర వచ్చేసింది. ఈ వారం ఏకంగా ఆరు ఐపీఓలు ఉన్నాయి. వీటిలో మెయిన్‌బోర్డ్, SME విభాగాలు రెండు ఉన్నాయి. ఇవి కాకుండా మూడు IPOలు ఇప్పటికే మొదలయ్యాయి.

దేశీయ స్టాక్ మార్కెట్లో మళ్లీ IPOల జాతర వచ్చేసింది. ఈ వారం ఏకంగా ఆరు ఐపీఓలు ఉన్నాయి. వీటిలో మెయిన్‌బోర్డ్, SME విభాగాలు రెండు ఉన్నాయి. ఇవి కాకుండా మూడు IPOలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇవి వచ్చే వారంలో పూర్తికానున్నాయి. అలాగే వచ్చే వారంలో 10 కంపెనీలు తమ షేర్లను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసేందుకు సిద్ధమయ్యాయి.


6 కొత్త IPOలు

1. BLS E-Services Limited IPO: న్యూఢిల్లీ ఆధారిత కంపెనీ BLS E సర్వీసెస్ IPO జనవరి 30న ప్రారంభమవుతుంది. దీని ఒక్కో షేరు ధర రూ.129-135గా మొదలుకానుంది. ఇది BLS ఇంటర్నేషనల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ. BLS e Services ఆఫర్ ద్వారా 310.9 కోట్ల రూపాయలను సమీకరించాలని యోచిస్తోంది. ఈ ఇష్యూ ఫిబ్రవరి 1న ముగుస్తుంది.

2. మెగాథెర్మ్ ఇండక్షన్ లిమిటెడ్ IPO: ఇండక్షన్ హీటింగ్, మెల్టింగ్ ఉత్పత్తులను తయారు చేసే ఈ కంపెనీ IPO జనవరి 29న ఒక్కో షేరు ధర రూ.100-108 వద్ద ప్రారంభమవుతుంది. 53.91 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

3. హర్షదీప్ హార్టికో లిమిటెడ్ IPO: కుండలు, ప్లాంటర్‌ల తయారీదారు, సరఫరాదారు అయిన హర్షదీప్ హార్టికో ఇష్యూ జనవరి 29-31 మధ్య సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది. 42.42 లక్షల ఈక్విటీ షేర్ల బుక్ బిల్ట్ ఇష్యూ ద్వారా రూ.19.09 కోట్లను సమీకరించాలని కంపెనీ చూస్తోంది. ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.42-45గా నిర్ణయించబడింది.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Stock Market: వచ్చే వారంలో బడ్జెట్ సహా ఫెడ్ పాలసీలు...స్టాక్ మార్కెట్ల అంచనాలు!

4. మయాంక్ క్యాటిల్ ఫుడ్ లిమిటెడ్ IPO: ఈ IPO కూడా జనవరి 29-31 మధ్య తెరవబడుతుంది. గుజరాత్‌కు చెందిన ఈ కంపెనీ ఒక్కో షేరుకు రూ.108 ఫిక్స్‌డ్ ప్రైస్ బ్యాండ్ ద్వారా రూ.19.44 కోట్లు సమీకరించాలని భావిస్తోంది.

5. బవేజా స్టూడియోస్ లిమిటెడ్ IPO: బవేజా స్టూడియోస్ IPO జనవరి 29న తెరవబడుతుంది. వచ్చే వారం ప్రారంభమయ్యే IPOలలో పరిమాణంలో ఇదే అతిపెద్దదని చెప్పవచ్చు. టెక్నాలజీ ఆధారిత వాణిజ్య చిత్రాల నిర్మాణ సంస్థ బవేజా స్టూడియోస్ ఈ IPO నుంచి రూ.97.2 కోట్లను సమీకరించాలని చూస్తోంది. ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.170-180.

6. Gabriel Pet Straps Limited IPO: వచ్చే వారం రానున్న IPOలలో ఇదే చివరిది. హెవీ మెటీరియల్స్ ప్యాకేజింగ్ కోసం పెట్ పట్టీలను తయారు చేసే ఈ కంపెనీ జనవరి 31న తన ఇష్యూని ప్రారంభించనుంది. ఒక్కో షేరు ధరను రూ.101గా ప్రకటించారు. ఇష్యూ ఫిబ్రవరి 2తో ముగుస్తుంది. ఈ ఐపీఓ నుంచి రూ.8.06 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది.

Updated Date - Jan 28 , 2024 | 01:42 PM

Advertising
Advertising