ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hinderburg: హిండెన్‌బర్గ్ మరో సంచలనం.. తీవ్ర ఆందోళనలో స్టాక్ మార్కెట్లు

ABN, Publish Date - Aug 10 , 2024 | 04:24 PM

సరిగ్గా ఏడాది కిందట.. హిండెన్ బర్గ్(Hinderburg Report) అనే సంస్థ అదానీ గ్రూపుపై ఇచ్చిన నివేదిక ఎంతటి సంచనాలు సృష్టించిందో తెలిసిందే. ఈ నివేదిక దెబ్బకు అదానీ కంపెనీ షేర్లు అమాంతం పడిపోయాయి.

ఇంటర్నెట్ డెస్క్: సరిగ్గా ఏడాది కిందట.. హిండెన్ బర్గ్(Hinderburg Report) అనే సంస్థ అదానీ గ్రూపుపై ఇచ్చిన నివేదిక ఎంతటి సంచనాలు సృష్టించిందో తెలిసిందే. ఈ నివేదిక దెబ్బకు అదానీ కంపెనీ షేర్లు అమాంతం పడిపోయాయి.

అదానీ గ్రూప్‌నకు(Adani Group) చెందిన 86 బిలియన్ డాలర్లను ఆ ఒక్క నివేదిక తుడిచిపెట్టేసింది. స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. 2023 జనవరి 23న అదానీ గ్రూప్‌పై ఘాటైన నివేదిక ఇచ్చిన హిండెన్‌బర్గ్ మరో సంచలనంతోముందుకు వస్తోందా. అంటే అవుననే సంకేతాలిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు.


సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో హిండెన్ బర్గ్ తాజా పోస్ట్ వైరల్ అవుతోంది. "Something big soon India" అక్షరాల దీన్నే హిండెన్‌బర్గ్ అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీన్ని చూసే స్టాక్‌ మార్కెట్ వర్గాలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయాయి. ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనని మదుపర్లు టెన్షన్ పడుతున్నారు. భారత్‌లో మరో సంచలన నివేదికను త్వరలో రిలీజ్ చేయబోతున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


హిండెన్ బర్గ్ నివేదిక ఇదే..

2023 జనవరి 24 హిండెన్ బర్గ్ అదానీ గ్రూప్ సంస్థల గురించి సంచలన నివేదిక బయటపెట్టింది. అదానీ సంస్థల్లో షేర్ల ధరల్లో అవకతవకలు, ఆర్థికలావాదేవీల్లో అక్రమాలు జరుగుతున్నాయని హిండెన్ బర్గ్ ఆరోపణ చేసింది. ఫలితంగా ఆయన తన నికర మార్కెట్ విలువలో ఏకంగా 86 బిలియన్ డాలర్లు కోల్పోవాల్సి వచ్చింది. కానీ, నాటి క్లిష్ఠ పరిస్థితుల నుంచి క్రమంగా కోలుకుంటున్న అదానీ మళ్లీ తన పరుగు ప్రారంభించారు.


పురోగమిస్తున్న వేళ కలకలం..

అయితే కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లు(Stock Markets) సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. ఇలాంటి సమయంలో హిండెన్ బర్గ్ ఏ కంపెనీకి సంబంధించిన నివేదిక బయటపెడుతుందోననే భయాలు నెలకొన్నాయి. స్టాక్ మార్కెట్లు కొత్త శిఖరాలు అధిరోహిస్తున్న వేళ.. హిండెన్‌బర్గ్ కుట్రకోణంలోనే దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ఉద్దేశంతో నివేదికలు విడుదల చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Viral: ఒక్క రోజులో రూ.24,281 కోట్ల సంపాదన.. ఒకప్పుడు అంబానీ కంటే ధనవంతుడైన ఆ వ్యక్తి ఎవరో తెలుసా..?

Updated Date - Aug 10 , 2024 | 04:35 PM

Advertising
Advertising
<