ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

SpiceJet: గో ఫస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ కొనుగోలుకై స్పైస్‌జెట్, స్కైవన్ బిడ్ దాఖలు

ABN, Publish Date - Feb 16 , 2024 | 05:16 PM

చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌‌కు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. ఈ సంస్థను కొనుగోలు చేసేందుకు స్పైస్‌జెట్, స్కైవన్ సంస్థలు కలిసి బిడ్ దాఖలు చేశాయి.

చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న గో ఫస్ట్(Go First) ఎయిర్‌లైన్స్‌‌కు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. ఈ సంస్థను కొనుగోలు చేసేందుకు స్పైస్‌జెట్, స్కైవన్ సంస్థలు కలిసి బిడ్ దాఖలు చేశాయి. బిడ్‌ను స్పైస్‌జెట్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ తన వ్యక్తిగత హోదాలో బిజీ బీ ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి సమర్పించినట్లు తెలిపారు. ఈ విషయం ఎయిర్‌లైన్ చెప్పడంతో స్పైస్‌జెట్ లిమిటెడ్ షేర్లు ఈ రోజు మధ్యాహ్నం సెషన్‌లో 13% దూసుకెళ్లాయి. బీఎస్‌ఈలో స్పైస్‌జెట్ షేర్లు 13 శాతం పెరిగి రూ.71.90కి చేరాయి. దీంతో ఎయిర్‌లైన్ మార్కెట్ క్యాప్ విలువ రూ.4,858 కోట్లకు పెరిగింది.


GoFirst మంచి సామర్థ్యాన్ని కలిగి ఉందని, స్పైస్‌జెట్‌(SpiceJet)తో సన్నిహితంగా కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉందని తాను విశ్వసిస్తున్నానని స్పైస్‌జెట్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ ఈ సందర్భంగా అన్నారు. ఇది రెండు క్యారియర్‌లకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. ఇది మెరుగైన వ్యయ నిర్వహణ, ఆదాయ వృద్ధి, పటిష్టమైన మార్కెట్ స్థితికి దారి తీస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రెగ్యులేటరీ ఆమోదం పెండింగ్‌లో ఉన్న అదనపు సబ్‌స్క్రిప్షన్‌లతో రూ.744 కోట్ల విలువైన మొదటి విడత మూలధనాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. అదనంగా రూ.1000 కోట్ల రూపాయలను సమీకరించే ప్రక్రియను కూడా కంపెనీ ప్రారంభించింది. QIP ద్వారా రూ.2500 కోట్ల వరకు సమీకరించడానికి SpiceJet ఇప్పటికే చెల్లుబాటు అయ్యే వాటాదారుల ఆమోదాన్ని కలిగి ఉంది.

Updated Date - Feb 16 , 2024 | 05:16 PM

Advertising
Advertising