ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Stock Market: వచ్చే వారంలో బడ్జెట్ సహా ఫెడ్ పాలసీలు...స్టాక్ మార్కెట్ల అంచనాలు!

ABN, Publish Date - Jan 28 , 2024 | 12:51 PM

వచ్చే వారంలో స్టాక్ మార్కెట్లలో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఈ వారంలో మధ్యంతర బడ్జెట్, US ఫెడరల్ పాలసీ నిర్ణయం సహా పలు కంపెనీల త్రైమాసిక ఆదాయాలు స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతాయని తెలిపారు.

వచ్చే వారంలో స్టాక్ మార్కెట్ల(stock market)లో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఆ వారంలో మధ్యంతర బడ్జెట్, US ఫెడరల్ పాలసీ నిర్ణయం సహా పలు కంపెనీల త్రైమాసిక ఆదాయాలు స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ వీక్ కొంత కన్సాలిడేషన్‌ను చూపవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు పెట్టుబడిదారులు విదేశీ వాణిజ్య కార్యకలాపాలు, ప్రపంచ పోకడలపై కూడా దృష్టి పెడతారని అన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇంట్రాడే ట్రేడింగ్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: మధ్యంతర బడ్జెట్‌పై గంపెడాశలు

ఇక స్థూల ఆర్థిక రంగానికి సంబంధించి, తయారీ రంగానికి సంబంధించిన PMI డేటాను గురువారం ప్రకటించాల్సి ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న (గురువారం) ప్రవేశపెట్టనున్నారు. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం జనవరి 30, 31 తేదీల్లో జరగనుంది.

US ఫెడ్ వడ్డీ రేటు నిర్ణయానికి ముందు మార్కెట్ మరింత హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది కాకుండా BoE (బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్) ద్రవ్య విధానం కూడా ఉందని గుర్తు చేస్తున్నారు. మరోవైపు అదానీ గ్రీన్ ఎనర్జీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, మారుతీ సుజుకి ఇండియా, టైటాన్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఈ వారం తమ త్రైమాసిక ఆదాయాలను ప్రకటించనున్నాయి. గత వారం బీఎస్‌ఇ బెంచ్‌మార్క్ 982.56 పాయింట్లు లేదా 1.37 శాతం పడిపోయింది. నిఫ్టీ 269.8 పాయింట్లు లేదా 1.24 శాతం క్షీణించింది.

Updated Date - Jan 28 , 2024 | 12:51 PM

Advertising
Advertising