Stock Market Updates: వారంతంలో స్టాక్ మార్కెట్ల జోరు..250 పాయింట్ల ఎగువన సెన్సెక్స్
ABN, Publish Date - Jan 05 , 2024 | 10:28 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త సంవత్సరం మొదటి వారం చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం కూడా లాభాలతో ప్రారంభమైంది. BSE సెన్సెక్స్ 174 పాయింట్ల జంప్‌తో 72022 స్థాయి వద్ద మొదలా...కాగా నిఫ్టీ 50 ఈరోజు ట్రేడింగ్‌ను 47 పాయింట్ల లాభంతో 21705 స్థాయి వద్ద ఆరంభించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) కొత్త సంవత్సరం మొదటి వారం చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం కూడా లాభాలతో ప్రారంభమైంది. BSE సెన్సెక్స్ 174 పాయింట్ల జంప్‌తో 72022 స్థాయి వద్ద మొదలా...కాగా నిఫ్టీ 50 ఈరోజు ట్రేడింగ్‌ను 47 పాయింట్ల లాభంతో 21705 స్థాయి వద్ద ఆరంభించింది. ఉదయం 10.15 గంటలకు సెన్సెక్స్ 257 పాయింట్లు లాభపడి 72 వేల ఎగువన కొనసాగుతుండగా..నిఫ్టీ 75 పాయింట్లు పెరిగి 21,730 పరిధిలో కొనసాగుతుంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ(bank nifty), నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు కూడా 100, 318 పాయింట్లు వృద్ధి చెందింది. 2024లో US రేట్ల తగ్గింపుపై తాజా డేటా సందేహాలను లేవనెత్తినప్పటికీ, వచ్చే వారం ప్రారంభమయ్యే త్రైమాసిక ఫలితాలకు ముందు బ్యాంకింగ్, ఆటో, ఇంధనం, IT షేర్లు వరుసగా రెండవ సెషన్‌లో భారతీయ స్టాక్ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి.
ఈ క్రమంలో ప్రస్తుతం అదానీ పోర్ట్స్, విప్రో, ఎస్బీఐ లైఫ్, టెక్ మహీంద్రా, ఎల్టీఐ మైండ్ ట్రీ స్టాక్స్ టాప్ 5 లాభాల్లో కొనసాగుతుండగా..నెస్లీ, సన్ ఫార్మా, బ్రిటానియా, సిప్లా, దివిస్ ల్యాబ్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. అయితే గురువారం అమెరికా స్టాక్ మార్కెట్లు మిశ్రమ స్థాయిల్లో ముగిశాయి. S&P 500, నాస్‌డాక్ కాంపోజిట్ దిగువన ముగిశాయి. S&P 500 16.13 పాయింట్లు పతనమై 4,688.68 వద్ద, నాస్‌డాక్ కాంపోజిట్ 81.91 పాయింట్లు పడిపోయి 14,510.3 వద్దకు చేరుకుంది. కాగా డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 10.15 పాయింట్లు పెరిగి 37,440.34 వద్ద ముగిసింది.
రెండు రోజుల క్షీణత తర్వాత గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ బౌన్స్ కావడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.3.24 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈ 30 షేర్ల సెన్సెక్స్ 490.97 పాయింట్లు జంప్ చేసి 71,847.57 వద్ద ముగిసింది. రోజు ట్రేడింగ్‌లో 598.19 పాయింట్లు పెరిగి 71,954.79కి చేరుకుంది. దీని కారణంగా బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3,24,010.1 కోట్లు పెరిగి ఆల్ టైమ్ హై రూ.3,68,32,843.41 కోట్లకు చేరుకుంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: వివో నుంచి ప్రీమియం ఫోన్ ఎక్స్ 100
Updated Date - Jan 05 , 2024 | 10:28 AM