ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: కొనసాగుతున్న నష్టాలు.. 25 వేల దిగువకు నిఫ్టీ..

ABN, Publish Date - Oct 07 , 2024 | 04:06 PM

గత వారంలో భారీ నష్టాలను చవిచూసిన మార్కెట్లు, ఈ సోమవారం కూడా ఆ నష్టాలను కొనసాగించాయి. దీంతో వరుసగా ఆరో రోజు కూడా నష్టాలు తప్పలేదు. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత క్షీణించాయి.

Stock Market

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వాతావరణం, అమెరికా, ఐరోపా మార్కెట్లలో నెలకొన్న ఒత్తిడి కారణంగా దేశీయ సూచీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. గత వారంలో భారీ నష్టాలను చవిచూసిన మార్కెట్లు, ఈ సోమవారం కూడా ఆ నష్టాలను కొనసాగించాయి. దీంతో వరుసగా ఆరో రోజు కూడా నష్టాలు తప్పలేదు. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత క్షీణించాయి. అంతర్జాతీయ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న మదుపర్లు భారీగా అమ్మకాలకు పాల్పడుతున్నారు (Business News).


శుక్రవారం ముగింపు (81, 688)తో పోల్చుకుంటే దాదాపు 250 పాయింట్ల లాభంతో 81, 926 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ కాసేపు లాభాల్లో కొనసాగింది. ఒక దశలో 82, 137 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే ఆ తర్వాత అమ్మకాలు ప్రారంభం కావడంతో నష్టాల బాట పట్టింది. ఒక దశలో గరిష్టం నుంచి ఏకంగా 1500 పాయింట్లు కోల్పోయి 80, 726 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. చివరకు 638 పాయింట్ల నష్టంతో 81, 050 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. దాదాపు 70 పాయింట్ల లాభంతో రోజును ప్రారంభించింది. ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. చివరకు 218 పాయింట్ల భారీ నష్టంతో 24, 795 వద్ద స్థిరపడింది


సెన్సెక్స్‌లో ఎల్టీఐ మైండ్ ట్రీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్, పెర్సిస్టెంట్, ఎల్ అండ్ టీ టెక్నాలజీస్ లాభాల బాటలో పయనించాయి. వోడాఫోన్ ఐడియా, హిందుస్తాన్ కాఫర్, టాటా పవర్, పవర్ ఫైనాన్స్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బీఎస్‌ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1174 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ 983 పాయింట్లు కోల్పోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.98గా ఉంది.

ఇవి కూడా చదవండి..

Ratan Tata: అనారోగ్యం వార్తలపై స్పందించిన రతన్ టాటా.. క్లారిటీ


Viral Video: జోమాటో కంపెనీ ఓనర్‌కు మాల్‌లోకి నో ఎంట్రీ.. అసలేం జరిగిందంటే..


Bhavish Aggarwal: కమెడియన్‌పై ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ గరం గరం.. నెటిజన్ల కామెంట్స్

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 07 , 2024 | 04:06 PM