ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: లాభాలతో ప్రారంభమై నష్టాల్లోకి.. 81 వేల దిగువకు సెన్సెక్స్..

ABN, Publish Date - Oct 21 , 2024 | 12:44 PM

శుక్రవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియడం, చైనా వడ్డీ రేట్లను తగ్గించడంతో దేశీయ సూచీలు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి.

Stock Market

సోమవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. శుక్రవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియడం, చైనా వడ్డీ రేట్లను తగ్గించడంతో దేశీయ సూచీలు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ఒక దశలో గరిష్టాల నుంచి వెయ్యి పాయింట్లకు పైగా కోల్పోయింది. 81 వేల దిగువకు చేరుకుంది. సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి విడుదలవుతున్న ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోవడం మదుపర్లు సెంటిమెంట్‌‌ను దెబ్బతీస్తోంది (Business News).


శుక్రవారం ముగింపు (81, 224)తో పోల్చుకుంటే దాదాపు 500 పాయింట్ల లాభంతో 801, 770 వద్ద సోమవారం ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. ఓ దశలో గరిష్టం నుంచి దాదాపు 900 పాయింట్లు నష్టపోయి 80, 811 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆ తర్వాత కొద్దిగా కోలుకుంది. సెన్సెక్స్ ప్రస్తుతం మధ్యాహ్నం 12:30 గంటలకు 224 పాయింట్ల నష్టంతో 80, 999 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. దాదాపు 100పాయింట్లకు పైగా లాభంతో రోజును ప్రారంభించింది. ప్రస్తుతం 102 పాయింట్ల నష్టంతో 24, 751 వద్ద కొనసాగుతోంది.


సెన్సెక్స్‌లో టాటా కెమికల్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఒబెరాయ్ రియాలిటీ, బజాజ్ ఆటో లాభాల బాటలో ఉన్నాయి. ఇండియా మార్ట్, ఆర్బీఎల్ బ్యాంక్, టాటా కన్స్యూమర్, కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 356 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 144 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.07గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 21 , 2024 | 12:44 PM