Stock Market: 25 వేల దిగువకు నిఫ్టీ.. వెయ్యి పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్..
ABN, Publish Date - Sep 06 , 2024 | 04:04 PM
బ్యాంకులు, ఎనర్జీ స్టాక్‌ల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో వారంలో చివరి రోజైన శుక్రవారం దేశీయ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. వరుసగా రెండ్రోజులుగా నష్టాల్లోనే ముగుస్తున్న సెన్సెక్స్, నిఫ్టీ ఈ రోజు మరింత భారీగా నష్టపోయాయి. దాదాపు అన్ని రంగాలు నష్టాల్లోనే రోజును ముగించాయి.
బ్యాంకులు, ఎనర్జీ స్టాక్‌ల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో వారంలో చివరి రోజైన శుక్రవారం దేశీయ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. వరుసగా రెండ్రోజులుగా నష్టాల్లోనే ముగుస్తున్న సెన్సెక్స్, నిఫ్టీ ఈ రోజు మరింత భారీగా నష్టపోయాయి. దాదాపు అన్ని రంగాలు నష్టాల్లోనే రోజును ముగించాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, సెబీ ఛీప్‌పై ఆరోపణల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా నష్టాల బాటలోనే సాగాయి. సెన్సెక్స్ 82 వేల దిగువకు, నిఫ్టీ 25 వేల దిగువకు పడిపోయాయి. (Business News).
గురువారం ముగింపు (82, 201)తో పోల్చుకుంటే దాదాపు 30 పాయింట్ల నష్టంతో 82, 171 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. బ్యాంకింగ్, ఎనర్జీ సెక్టార్ స్టాకుల్లో అమ్మకాలు సెన్సెక్స్‌ను దిగజార్చాయి. ఆ దెబ్బకు సెన్సెక్స్ ఒక దశలో 1300 పాయింట్లకు పైగా కోల్పోయి 80,981 వద్ద ఇంట్రాడే లోను తాకింది. చివరకు 1017 పాయింట్ల నష్టంతో 81, 183 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఏకంగా 292 పాయింట్లను కోల్పోయింది. 25 వేల మార్కుకు దిగువలో 24, 852 వద్ద రోజును ముగించింది.
సెన్సెక్స్‌లో ఎస్బీఐ కార్డ్, మారికో, పీఐ ఇండస్ట్రీస్, కోఫోర్జ్ లిమిటెడ్ షేర్లు లాభాలు ఆర్జించాయి. వోడాఫోన్ ఐడియా, జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్, ఇండస్ టవర్స్, కెనరా బ్యాంక్ నష్టాలను మూట్టగట్టుకున్నాయి. బీఎస్‌ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 946 పాయింట్ల నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ 896 పాయింట్లు కోల్పోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.95గా ఉంది.
ఇవి కూడా చదవండి..
Advance Tax: ముందస్తు పన్ను అంటే ఏంటి.. దీని ప్రయోజనాలు ఏంటి, ఎవరికి లాభం
Fire Accident: స్కూల్ హాస్టల్లో భారీ అగ్నిప్రమాదం.. 17 మంది విద్యార్థులు సజీవ దహనం
BSNL: జియో, ఎయిర్‌టెల్ కట్టడికి బీఎస్ఎన్ఎల్ పెద్ద ప్లాన్.. టాటా సపోర్ట్‌తో ఇక..
Money Saving Tips: రోజు రూ.250 సేవ్ చేయండి.. ఇలా రూ.2 కోట్లు సంపాదించండి..
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Sep 06 , 2024 | 09:10 PM