ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: భారీ నష్టాల్లో దేశీయ సూచీలు.. వెయ్యి పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్..

ABN, Publish Date - Dec 17 , 2024 | 04:00 PM

అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను ప్రకటించనున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. బ్యాంకింగ్, ఆటో, ఐటీ, మెటల్స్ రంగంలో అమ్మకాలు వెల్లువెత్తడంతో దేశీయ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి.

Stock Market

అమెరికా ఫెడరల్ బ్యాంక్ బుధవారం వడ్డీ రేట్లను ప్రకటించనున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. బ్యాంకింగ్, ఆటో, ఐటీ, మెటల్స్ రంగంలో అమ్మకాలు వెల్లువెత్తడంతో దేశీయ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ రోజంతా అదే ధోరణిలో కొనసాగింది. ఈ దెబ్బకు సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ మళ్లీ 24, 350 దిగువకు పడిపోయింది (Business News).


సోమవారం ముగింపు (81, 748)తో పోల్చుకుంటే 200 పైగా పాయింట్ల నష్టంతో మంగళవారం ఉదయం మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత నష్టాలు మరింత పెరిగాయి. ఒక దశలో 1100 పాయింట్లకు పైగా కోల్పోయి 80, 612 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. చివరకు 1064 పాయింట్ల నష్టంతో 80, 684 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. వంద పాయింట్లకు పైగా నష్టంతో రోజును ప్రారంభించింది. రోజంతా నష్టాల్లోనే కొనసాగి చివరకు 332 పాయింట్ల నష్టంతో 24, 336 వద్ద రోజును ముగించింది.


సెన్సెక్స్‌లో నేషనల్ అల్యూమినియం, యునైటెడ్ స్పిరిట్స్, ఒబెరాయ్ రియాలిటీ, మ్యాక్స్ హెల్త్‌కేర్ షేర్లు లాభాలు అందుకున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌ఎఫ్‌సీఎల్, మహానగర్ గ్యాస్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 298 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 746 పాయింట్లు నష్టపోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.92గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 17 , 2024 | 04:00 PM