Stock Market: కొనసాగుతున్న నష్టాలు.. 80 వేల దిగువకు సెన్సెక్స్..
ABN, Publish Date - Oct 25 , 2024 | 10:10 AM
విదేశీ మదుపర్ల నిధుల ఉపసంహరణ కారణంగా దేశీయ సూచీలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. వరుసగా నష్టాలను చవిచూస్తున్న మార్కెట్లు గురువారం ఉదయం కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. స్వల్ప లాభాలతో ప్రారంభమై నష్టాల్లోకి జారిపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు, విదేశీ మదుపర్ల నిధుల ఉపసంహరణ కారణంగా దేశీయ సూచీలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. వరుసగా నష్టాలను చవిచూస్తున్న మార్కెట్లు గురువారం ఉదయం కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. స్వల్ప లాభాలతో ప్రారంభమై నష్టాల్లోకి జారిపోయాయి. దీంతో సెన్సెక్స్ 80 వేల దిగువకు పడిపోయింది. సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి విడుదలవుతున్న ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోవడం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల బాటలోనే ఉన్నాయి (Business News).
గురువారం ముగింపు (80, 065)తో పోల్చుకుంటే 100 పాయింట్ల లాభంతో 80, 187 వద్ద బుధవారం ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత మరో 70 పాయింట్లు ఎగబాకింది. 80,253 వద్ద గరిష్టానికి చేరుకుంది. అయితే ఆ దశలో అమ్మకాలు మొదలు కావడంతో నష్టాల బాట పట్టింది. వరుస నష్టాలతో 80 వేల దిగువకు పడిపోయింది. గరిష్టం నుంచి ఏకంగా 600 పాయింట్లు కోల్పోయి వద్ద 79, 662 వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ప్రస్తుతం ఉదయం 10:00 గంటలకు 350 పాయింట్ల నష్టంతో 79, 714 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. స్వల్ప లాభంతో రోజును ప్రారంభించి నష్టాల బాట పట్టింది. ప్రస్తుతం 142 పాయింట్ల నష్టంతో 24, 259వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్‌లో ఐటీసీ, లారస్ ల్యాబ్స్, ఒరాకిల్ ఫిన్‌సెర్వ్, గోద్రేజ్ కన్స్యూమర్ షేర్లు లాభాల బాటలో ఉన్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, డిక్సన్ టెక్నాలజీస్, ఏయూ స్మాల్ ఫైనాన్స్, నాల్కో షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. వరుసగా నష్టాలు ఎదుర్కొంటున్న మిడ్ క్యాప్ ఇండెక్స్ ప్రస్తుతం 900 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 837 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.07గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Oct 25 , 2024 | 10:10 AM