ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: దేశీయ సూచీలకు భారీ నష్టాలు.. 79 వేల దిగువకు సెన్సెక్స్..

ABN, Publish Date - Nov 04 , 2024 | 11:02 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనిశ్చితి, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, విదేశీ సంస్థాగత మదుపర్ల నిధుల ఉపసంహరణ కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవి చూస్తున్నాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత భారీగా దిగజారాయి.

Stock Market

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనిశ్చితి, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, విదేశీ సంస్థాగత మదుపర్ల నిధుల ఉపసంహరణ కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవి చూస్తున్నాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత భారీగా దిగజారాయి. ఈ నష్టాలతో సెన్సెక్స్ 79 వేల దిగువకు పడిపోయింది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే భారీ నష్టాలను మూటగట్టుకుంటోంది (Business News).


శుక్రవారం ముగింపు (79, 724)తో పోల్చుకుంటే 10 పాయింట్ల స్వల్ప నష్టంతో 79, 713 వద్ద సోమవారం ఉదయం మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత వేగంగా నష్టాల బాట పట్టింది. ఒక దశలో దాదాపు 1200 పాయింట్లు కోల్పోయి 78, 515 వద్ద కనిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం ఉదయం 10:50 గంటల సమయంలో సెన్సెక్స్ 1190 పాయింట్ల నష్టంతో 78, 533 వద్ద కొనసాగుతోంది. చాలా రోజుల తర్వాత 79 వేల దిగువకు పడిపోయింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ఫ్రంట్‌లైన్ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. నిఫ్టీ ప్రస్తుతం 3976 పాయింట్ల నష్టంతో 23, 906 వద్ద కొనసాగుతోంది. 24 వేల దిగువకు పడిపోయింది.


సెన్సెక్స్‌లో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, టెక్ మహీంద్రా, పెట్రొనాట్ ఎల్‌ఎన్‌జీ, సిప్లా షేర్లు లాభాలు అందుకుంటున్నాయి. పీవీఆర్ ఐనాక్స్, ఐఓసీ, హీరో మోటోకార్ప్, ఆర్తి ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ ప్రస్తుతం 888 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 415 పాయింట్ల నష్టంతో ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.07గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 04 , 2024 | 11:02 AM