ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: ఫలితాలు నిరాశాజనకం.. కొనసాగుతున్న నష్టాలు.. సెన్సెక్స్ మరింత డౌన్..

ABN, Publish Date - Nov 13 , 2024 | 10:07 AM

ఫైనాన్స్, ఆటో సెక్టార్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో దేశీయ సూచీలు నష్టాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం కూడా దేశీయ సూచీలు నష్టాల్లోనే కొనసాగుతన్నాయి. సెన్సెక్స్, నిఫ్టీతో పాటు పలు రంగాల సూచీలు నష్టాలను చవిచూస్తున్నాయి.

Stock Market

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ జీవన కాల కనిష్టానికి పడిపోవడం, విదేశీ మదుపర్లు చైనా వైపు నిధులు మళ్లిస్తుండడం, సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండడంతో దేశీయ సూచీలు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. ఫైనాన్స్, ఆటో సెక్టార్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో దేశీయ సూచీలు నష్టాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం కూడా దేశీయ సూచీలు నష్టాల్లోనే కొనసాగుతన్నాయి. సెన్సెక్స్, నిఫ్టీతో పాటు పలు రంగాల సూచీలు నష్టాలను చవిచూస్తున్నాయి. (Business News).


మంగళవారం ముగింపు (78, 675)తో పోల్చుకుంటే దాదాపు 180 పాయింట్ల నష్టంతో 78, 495 వద్ద బుధవారం ఉదయం మొదలైన సెన్సెక్స్ మరో 200 పాయింట్లు కోల్పోయి 78, 253 వద్ద కనిష్టానికి చేరుకుంది. ఆ తర్వాత కొద్దిగా కోలుకుంది. ప్రస్తుతం ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 256 పాయింట్ట నష్టంతో 78, 425 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ఒక దశలో 160 పాయింట్లకు పైగా నష్టపోయింది. ప్రస్తుతం 119 పాయింట్ల నష్టంతో 23, 764 వద్ద కొనసాగుతోంది.


సెన్సెక్స్‌లో జుబిలెంట్ ఫుడ్స్, రామ్‌కో సిమెంట్స్, ఎల్ అండ్ టీ టెక్నాలజీస్, యూపీఎల్ షేర్లు లాభాలు అందుకుంటున్నాయి. హిందుస్తాన్ ఏరోనాటిక్స్, మెట్రోపోలిస్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ ప్రస్తుతం 794 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.39గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 13 , 2024 | 10:07 AM