ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: రెండు రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ట్రేడ్ అవుతున్న దేశీయ సూచీలు..

ABN, Publish Date - Nov 07 , 2024 | 10:21 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ గెలవడంతో బుధవారం దూసుకుపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నేల చూపులు చూస్తున్నాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో నష్టాలు తప్పడం లేదు. ఈ రోజు రాత్రి ఫెడ్ మీటింగ్ నిర్ణయాలు రానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Stock Market

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ గెలవడంతో బుధవారం దూసుకుపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నేల చూపులు చూస్తున్నాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో నష్టాలు తప్పడం లేదు. ఈ రోజు రాత్రి ఫెడ్ మీటింగ్ నిర్ణయాలు రానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మంగళ, బుధవారాలు లాభాలు అర్జించిన సూచీలు ఈ రోజు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాల బాట పట్టింది. 80 వేల దిగువకు పడిపోయింది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే నష్టాల్లో కదలాడుతోంది (Business News).


బుధవారం ముగింపు (80, 378)తో పోల్చుకుంటే దాదాపు 200 పాయింట్ల లాభంతో 80, 563 వద్ద గురువారం ఉదయం మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకుంది. 80 వేల మార్క్‌ దిగువకు పడిపోయింది. గరిష్టం నుంచి ఏకంగా వెయ్యి పాయింట్లు కోల్పోయి 79, 487 వద్ద కనిష్టానికి చేరింది. ప్రస్తుతం ఉదయం 10:15 గంటల సమయంలో సెన్సెక్స్ 858 పాయింట్ల నష్టంతో 79, 533 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ఒక దశలో 280 పాయింట్లకు పైగా పడిపోయింది. ప్రస్తుతం 260 పాయింట్ల నష్టంతో 24, 218 వద్ద కొనసాగుతోంది.


సెన్సెక్స్‌లో అపోలో హాస్పిటల్స్, గుజరాత్ గ్యాస్, చంబల్ ఫెర్టిలైజర్స్, గెయిల్ షేర్లు లాభాలు అందుకుంటున్నాయి. హిందోల్కా, గ్లెన్‌మార్క్, ముత్తూట్ ఫైనాన్స్, ఎస్కార్ట్స కుబోటా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ ప్రస్తుతం 21 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 485 పాయింట్ల నష్టంలో ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.31గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 07 , 2024 | 10:21 AM