Stock Market: లాభాల బాటలో దేశీయ సూచీలు.. టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN, Publish Date - Dec 03 , 2024 | 10:41 AM
ఫైనాన్స్, బ్యాంకింగ్ స్టాక్స్ రాణిస్తుండడం, స్మాల్ అండ్ మిడ్ క్యాప్‌లో పెట్టుబడులు స్టాక్ మార్కెట్లకు కలిసి వస్తోంది. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడ్ అవుతుండడం దేశీయ సూచీలపై సానుకూల ప్రభావాన్ని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ అదే జోరును కొనసాగిస్తోంది.
దేశీయ సూచీలు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. ఫైనాన్స్, బ్యాంకింగ్ స్టాక్స్ రాణిస్తుండడం, స్మాల్ అండ్ మిడ్ క్యాప్‌లో పెట్టుబడులు స్టాక్ మార్కెట్లకు కలిసి వస్తోంది. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడ్ అవుతుండడం దేశీయ సూచీలపై సానుకూల ప్రభావాన్ని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ అదే జోరును కొనసాగిస్తోంది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది (Business News).
మంగళవారం ముగింపు (80, 248)తో పోల్చుకుంటే దాదాపు 170 పాయింట్ల లాభంతో 80, 529 వద్ద బుధవారం ఉదయం మొదలైన సెన్సెక్స్ లాభాల జోరును కొనసాగిస్తోంది. ఒక దశలో దాదాపు 500 పాయింట్లు లాభపడి 80, 701 వద్ద గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 390 పాయింట్ల లాభంతో 80, 645 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. దాదాపు 100 పాయింట్ల లాభంతో రోజును ప్రారంభించింది. ప్రస్తుతం 119 పాయింట్ల లాభంతో 24, 396 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్‌లో టాటా ఎలాక్సీ, కేపీఐటీ టెక్నాలజీస్, మనప్పురం ఫైనాన్స్, సీఈఎస్‌సీ షేర్లు లాభాలు అందుకుంటున్నాయి. సీజీ కన్స్యూమర్, మెట్రోపోలిస్, ఎమ్‌సీఎక్స్ ఇండియా, పీబీ ఫిన్‌టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ ప్రస్తుతం 355 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 513 పాయింట్ల లాభాంలో ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.75గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Dec 03 , 2024 | 10:41 AM