Stock Market: లాభాల్లో దేశీయ సూచీలు.. 400 పాయింట్ల లాభంలో సెన్సెక్స్..
ABN, Publish Date - Oct 14 , 2024 | 10:37 AM
గత వారం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొని నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వాతావరణం గత రెండు వారాలుగా దేశీయ సూచీలను ఉక్కిరిబిక్కిరి చేసింది. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనమయ్యాయి.
గత వారం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొని నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వాతావరణం గత రెండు వారాలు దేశీయ సూచీలను ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనమయ్యాయి. అయితే రాబోయే కాలంలో సూచీలు స్థిరంగా కొనసాగతాయని అంచనాలు వెలువడుతుండడంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీతో పాటు పలు రంగాలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. (Business News).
శుక్రవారం ముగింపు (81, 381)తో పోల్చుకుంటే దాదాపు 200 పాయింట్ల లాభంతో 81, 576 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింతగా లాభాల్లోకి దూసుకొచ్చింది. 81, 930 వద్ద గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం ఉదయం 10:29 గంటలకు 470 పాయింట్లకు పైగా లాభపడి 81, 830 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. దాదాపు 50 పాయింట్లకు పైగా లాభంతో రోజును ప్రారంభించి ప్రస్తుతం 25, 100 వద్ద కొనసాగుతోంది. మళ్లీ 25 వేల మార్క్‌ను దాటింది.
సెన్సెక్స్‌లో ఒబెరాయ్ రియాల్టీ, నేషనల్ అల్యూమినియం, విప్రో, ఫెడరల్ బ్యాంక్ షేర్లు లాభాల బాటలో ఉన్నాయి. టాటా కెమికల్స్, బంధన్ బ్యాంక్, ఐజీఎల్, కొల్గేట్ షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 89 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 136 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.07గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Oct 14 , 2024 | 10:37 AM