Stock Market: నష్టాలతో మొదలై లాభాల్లోకి.. ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న దేశీయ సూచీలు..
ABN, Publish Date - Oct 16 , 2024 | 10:33 AM
అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల కారణంగా దేశీయ సూచీలు లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి నష్టాల బాట పట్టిన సూచీలు బుధవారం ఉదయం నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. అయితే కాసేపటికి కోలుకున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల కారణంగా దేశీయ సూచీలు లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి నష్టాల బాట పట్టిన సూచీలు బుధవారం ఉదయం నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. అయితే కాసేపటికి కోలుకున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి విడుదలవుతున్న ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోవడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఈ రోజు ఆసియా సూచీలు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ఆ బాటలోనే దేశీయ సూచీలు కూడా కదలాడుతున్నాయి (Business News).
మంగళవారం ముగింపు (81, 820)తో పోల్చుకుంటే దాదాపు 180 పాయింట్ల నష్టంతో 81, 646 వద్ద బుధవారం ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత మరో వంద పాయింట్లు నష్టపోయి 81, 579 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆ దశలో కొనుగోళ్లు మొదలు కావడంతో సూచీలు కోలుకున్నాయి. 81, 932 వద్ద గరిష్టానికి చేరుకున్నాయి. అయితే మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో సూచీలు లాభనష్టాలతో సాగుతున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం ఉదయం 10:30 గంటలకు 35 పాయింట్ల స్వల్ప నష్టంతో 81, 784 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. దాదాపు 50 పాయింట్లకు పైగా నష్టంతో రోజును ప్రారంభించి ఆ తర్వాత కోలుకుంది. ప్రస్తుతం 4 పాయింట్ల స్వల్ప నష్టంతో 25, 053 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ, వోల్టాస్, కమిన్స్, హిందుస్తాన్ పెట్రో లాభాల బాటలో ఉన్నాయి. జైడూస్ లైఫ్ సైన్సెన్స్, లాల్‌ఫాథ్ ల్యాబ్స్, ఇప్కా ల్యాబ్స్, కోఫోర్జ్ లిమిటెడ్ షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 6 పాయింట్ల స్వల్ప నష్టంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 15 పాయింట్ల స్వల్ప లాభంతో కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.05గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Oct 16 , 2024 | 10:33 AM