ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: మళ్లీ నష్టాల్లోనే ముగిసిన సూచీలు.. 230 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..

ABN, Publish Date - Oct 11 , 2024 | 04:02 PM

ఈ వారం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న దేశీయ సూచీలు చివరకు నష్టాలతోనే వారాన్ని ముగించాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వాతావరణం, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వంటి కారణాలతో దేశీయ సూచీలు జీవన కాల గరిష్టల నుంచి దిగి వచ్చిన సంగతి తెలిసిందే.

Stock Market

ఈ వారం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న దేశీయ సూచీలు చివరకు నష్టాలతోనే వారాన్ని ముగించాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వాతావరణం, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వంటి కారణాలతో దేశీయ సూచీలు జీవన కాల గరిష్టల నుంచి దిగి వచ్చిన సంగతి తెలిసిందే. సూచీల పయనంపై ఆందోళనకు గురవుతున్న మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్ 230 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది. (Business News).


గురువారం ముగింపు (81, 611)తో పోల్చుకుంటే దాదాపు 200 పాయింట్ల నష్టంతో 81, 478 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ దాదాపు రోజుంతా నష్టాల్లోనే కొనసాగింది. ఒక దశలో 81, 671 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకినా మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. ఆ తర్వాత 300 పాయింట్లకు పైగా నష్టపోయి 81,304 ఇంట్రాడే కనిష్టాన్ని చేరుకుంది. చివరకు 230 పాయింట్ల నష్టంతో 81, 381 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 34 పాయింట్ల నష్టంతో 24, 9643 వద్ద స్థిరపడింది.


సెన్సెక్స్‌లో బంధన్ బ్యాంక్, నేషనల్ అల్యూమినియం, గ్రాన్సుయల్స్ ఇండియా, పెర్సిస్టెంట్ లాభాల బాటలో పయనించాయి. కమిన్స్, సీజీ కన్స్యూమర్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, మహానగర్ గ్యాస్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 276 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 358 పాయింట్లు కోల్పోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.06గా ఉంది.

Updated Date - Oct 11 , 2024 | 04:02 PM