Stock Market: రోజంతా అనిశ్చితిలోనే .. చివరకు ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు!
ABN, Publish Date - May 08 , 2024 | 04:28 PM
లోక్‌సభ ఎన్నికలు, దేశీయ కంపెనీలు వెల్లడిస్తున్న ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో మదుపర్లు ఆచూతూచి అడుగులేస్తున్నారు. దీంతో బుధవారం కూడా దేశీయ సూచీలు రోజంతా ఒడిదుడుకుల మధ్యనే సాగాయి.
లోక్‌సభ ఎన్నికలు, దేశీయ కంపెనీలు వెల్లడిస్తున్న ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో మదుపర్లు ఆచూతూచి అడుగులేస్తున్నారు. దీంతో బుధవారం కూడా దేశీయ సూచీలు రోజంతా ఒడిదుడుకుల మధ్యనే సాగాయి. ఎఫ్‌సీజీ, బ్యాంకింగ్ రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడం దేశీయ సూచీలపై ప్రభావం చూపుతోంది. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా అనిశ్చితిలోనే కదలాడింది. (Business News).
బుధవారం ఉదయం 73,225 వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యాహ్నం తర్వాత లాభాల్లోకి వచ్చింది. అయితే తిరిగి క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. ఓ దశలో 73,073 ఇంట్రాడే కనిష్టానికి పడిపోయింది. చివరకు 45.46 పాయంట్ల నష్టంతో 73,466 వద్ద రోజును ముగించింది. నిఫ్టీ ఏమీ నష్ట పోకుండా నిన్నిటి ముగింపు (22,302)వద్దే రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 264 పాయింట్లు కోల్పోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 360 పాయింట్లు లాభపడింది.
సెన్సెక్స్‌లో ప్రధానంగా ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్థాన్ యూనీలివర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, మారుతి వంటి షేర్లు లాభాలను ఆర్జించాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.51గా ఉంది.
ఇవి కూడా చదవండి..
Two Pan Cards: ఒకే వ్యక్తి 2 పాన్ కార్డులు తీసుకోవచ్చా, తీసుకుంటే ఏమవుతుంది?
Google Pixel 8a: గూగుల్ పిక్సెల్ 8a ధర, ఫీచర్లు ఇవే.. కొనాలనుకుంటే.. ఓ లుక్కేయండి..!
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 08 , 2024 | 04:29 PM