ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: లాభాల్లో దేశీయ సూచీలు.. 285 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..!

ABN, Publish Date - Jul 31 , 2024 | 04:03 PM

రెండ్రోజులుగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న దేశీయ సూచీలు బుధవారం లాభాల బాటపట్టాయి. కంపెనీలు ప్రకటిస్తున్న ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో మదుపర్లు అమ్మకాలపై ఆసక్తి చూపించారు. దీంతో సోమ, మంగళవారాల్లో ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ సూచీలు బుధవారం లాభాలను కళ్లజూశాయి.

Stock Market

రెండ్రోజులుగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న దేశీయ సూచీలు బుధవారం లాభాల బాటపట్టాయి. కంపెనీలు ప్రకటిస్తున్న ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో మదుపర్లు అమ్మకాలపై ఆసక్తి చూపించారు. దీంతో సోమ, మంగళవారాల్లో ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ సూచీలు బుధవారం లాభాలను కళ్లజూశాయి. రోజంతా లాభాల్లోనే కదలాడిన సెన్సెక్స్ 285 పాయింట్ల లాభాంతో రోజును ముగించింది. నిఫ్టీ 93 పాయింట్లు ఎగబాకింది. (Business News).


మంగళవారం ముగింపు (81, 455)తో పోల్చుకుంటే దాదాపు 200 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో దాదాపు 400 పాయింట్లకు పైగా లాభపడి 81, 828 వద్ద ఇంట్రాడే హైని టచ్ చేసింది. చివరకు 285 పాయింట్ల లాభంతో 81, 741 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా అదే బాటలో పయనించింది. ఒక దశలో 140 పాయింట్లకు పైగా లాభపడింది. చివరకు 93 పాయింట్ల లాభంతో 24, 951 వద్ద స్థిరపడింది.


సెన్సెక్స్‌లో గ్రాన్యుయల్స్ ఇండియా, టాటా కమ్యూనికేషన్, ట్రెంట్, ఎస్‌ఆర్‌ఎఫ్ షేర్లు లాభాలు ఆర్జించాయి. ఇండియా మార్ట్, బిర్లా సాఫ్ట్, ఇండస్ టవర్స్, జేకే సిమెంట్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బీఎస్‌ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 367 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 54 పాయింట్లు ఎగబాకింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.72గా ఉంది.

ఇవి కూడా చదవండి..

Ola IPO: ఓలా ఐపీఓ షేర్ల ధర ఫిక్స్.. పెట్టుబడికి ఎంత కావాలంటే..

Saving Schemes: ఈ పోస్టాఫీస్ స్కీం ద్వారా ఐదేళ్లలో లక్షాధికారులు కావచ్చు..ఎలాగంటే


Bank Holidays: ఆగస్టులో దాదాపు సగం రోజులు బ్యాంకులు బంద్.. కారణాలివే

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 31 , 2024 | 04:03 PM

Advertising
Advertising
<