ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు.. అన్ని రంగాలూ నష్టాల్లోనే..!

ABN, Publish Date - Jul 10 , 2024 | 03:50 PM

వరుస లాభాలతో రికార్డుల దిశగా దూసుకుపోతున్న దేశీయ స్టాక్ మార్కెట్లకు బుధవారం భారీ బ్రేక్ పడింది. గరిష్టాల వద్ద మదుపర్లు అమ్మకాలకు దిగడంతో సూచీలు నష్టాల్లోనే కదలాడాయి. ఈ దెబ్బకు సెన్సెక్స్ మళ్లీ 80 వేల దిగువకు దిగి వచ్చింది.

Stock Market

వరుస లాభాలతో రికార్డుల దిశగా దూసుకుపోతున్న దేశీయ స్టాక్ మార్కెట్లకు బుధవారం భారీ బ్రేక్ పడింది. గరిష్టాల వద్ద మదుపర్లు అమ్మకాలకు దిగడంతో సూచీలు నష్టాల్లోనే కదలాడాయి. ఈ దెబ్బకు సెన్సెక్స్ మళ్లీ 80 వేల దిగువకు దిగి వచ్చింది. ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్ ఆ తర్వాత కొద్దిగా కోలుకుంది. అన్ని రంగాల్లోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ బాటలోనే నిఫ్టీ కూడా భారీ నష్టాలను నమోదు చేసింది. (Business News).


మంగళవారం ముగింపు (80, 351)తో పోల్చుకుంటే స్వల్ప లాభంతో 80, 481 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. 80,481 నుంచి ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా కోల్పోయి 79, 435కు పడిపోయింది. ఆ తర్వాత నష్టాల నుంచి కొద్దిగా కోలుకుంది. చివరకు 426 పాయింట్ల నష్టంతో 79, 924 వద్ద రోజును ముగించింది. ఇక, నిఫ్టీ కూడా అదే బాటలో పయనించింది. రోజంతా నష్టాల్లోనే కదలాడింది. చివరకు 108 పాయింట్ల కోల్పోయి 24,324 వద్ద స్థిరపడింది.


సెన్సెక్స్‌లో ఇండియా సిమెంట్స్, జేకే సిమెంట్, ఆసియన్ పెయింట్స్, మహానగర్ గ్యాస్ షేర్లు లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, బంధన్ బ్యాంక్, ఎమ్‌సీఎక్స్ ఇండియా, ఐఈఎక్స్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 156 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 379 పాయింట్లు నష్టపోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.52గా ఉంది.

ఇవి కూడా చదవండి..

Fake Products: ఆన్‌లైన్‌ షాపింగ్‌లో ప్రొడక్ట్ నకిలీదా లేక నిజమైనదో ఇలా గుర్తించండి


Stock Markets: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. ఇవే టాప్ 5 స్టాక్స్


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 10 , 2024 | 03:50 PM

Advertising
Advertising
<