ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: లాభాల్లో దేశీయ సూచీలు.. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ హై..!

ABN, Publish Date - Jul 16 , 2024 | 11:24 AM

దేశీయ సూచీలు లాభాల బాటలో కొనసాగుతున్నాయి. సరికొత్త గరిష్టాలను చేరుకుంటూ రికార్డుల దిశగా దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయంగా అనుకూల పరిస్థితుల కారణంగా మంగళవారం దేశీయ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి.

Stock Market

దేశీయ సూచీలు లాభాల బాటలో కొనసాగుతున్నాయి. సరికొత్త గరిష్టాలను చేరుకుంటూ రికార్డుల దిశగా దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనుకూల పరిస్థితుల కారణంగా మంగళవారం దేశీయ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ జీవన కాల గరిష్టాన్ని టచ్ చేశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఇప్పటివరకు అదే జోరును చూపిస్తున్నాయి. (Business News).


సోమవారం ముగింపు (80, 664)తో పోల్చుకుంటే దాదాపు 100 పాయింట్ల లాభంతో రోజును ప్రారంభించిన సెన్సెక్స్ ఒక దశలో 300 పాయింట్లకు పైగా లాభపడి 80, 895 వద్ద ఇంట్రాడే హై ను టచ్ చేసింది. ఉదయం 11:15 గంటల సమయంలో 197 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. నిఫ్టీ కూడా అదే బాటలో పయనిస్తూ లాభాలు అందుకుంటోంది. 24, 661 వద్ద లైఫ్ టైమ్ హైని టచ్ చేసింది. ఉదయం 11:15 గంటల సమయంలో 69 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది.


సెన్సెక్స్‌లో ఇండియా సిమెంట్స్, కోల్ ఇండియా, హిందుస్తాన్ పెట్రో, బీపీసీఎల్ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎల్ అండ్ టీ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ ప్రుడెన్సియల్, ఎమ్ అండ్ ఎమ్ ఫైనాన్సియల్స్ నష్టాల్లో చవిచూస్తున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.59గా ఉంది.

ఇవి కూడా చదవండి..

వాణిజ్య లోటు రూ.1.76 లక్షల కోట్లు


టీవీఎస్‌ నుంచి రెండు కొత్త బైక్స్‌


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 16 , 2024 | 11:24 AM

Advertising
Advertising
<