Stock Markets: గరిష్ట లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..సెన్సెక్స్ 759 పాయింట్లు జంప్
ABN, Publish Date - Jan 15 , 2024 | 03:51 PM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజు గరిష్ట లాభాలను స్కేల్ చేశాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 759 పాయింట్లు పెరిగి 73,328 వద్ద ముగియగా, నిఫ్టీ 50 కూడా 200 పాయింట్లు లాభపడి 22,000 స్థాయిని అధిగమించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock markets) వారంతంలో మొదటి రోజు భారీ లాభాలతో ముగిశాయి. ఈ క్రమంలో BSE సెన్సెక్స్ మొదటిసారిగా 73,000 మార్క్‌ను అధిగమించి జీవితకాల గరిష్ట స్థాయి 73,402 స్థాయిని తాకింది. ఈ క్రమంలో ఇండెక్స్ 759 పాయింట్లు లేదా 1.05 శాతం పెరిగి 73,328 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 50 కూడా ఇంట్రాడేలో 22,000 మార్క్‌ను అధిగమించి, 22,116 వద్ద కొత్త శిఖరాన్ని చేరుకుంది. ఇది 203 పాయింట్లు లేదా 0.93 శాతం పెరిగి 22,097 వద్దకు చేరుకుంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Jairam Ramesh: మోదీ మణిపూర్‌లో ఎందుకు పర్యటించలేదని ప్రజలు అడుగుతున్నారు..ఏం చెబుతారు?
అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాక్స్ సెంటిమెంట్‌ను బలపరిచినందున బెంచ్‌మార్క్ సూచీలు సోమవారం గ్రీన్‌లో ట్రేడ్ అయ్యాయి. ఈ క్రమంలో మూడవ త్రైమాసిక ఫలితాల్లో (Q3FY24) కంపెనీ లాభాల అంచనాలను బీట్ చేయడంతో విప్రో షేర్లు ఇంట్రాడేలో 14 శాతం పెరిగాయి.
దీంతోపాటు హెచ్‌సిఎల్ టెక్, భారతీ ఎయిర్‌టెల్, టెక్ ఎం, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్‌టిపిసి, మారుతీ సుజుకీ, హెచ్‌యుఎల్, టైటాన్, ఎస్‌బిఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, టీసీఎస్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. మరోవైపు HDFC లైఫ్, బజాజ్ ఫైనాన్స్, హిండాల్కో, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐషర్ మోటార్స్ సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ముగిశాయి.
Updated Date - Jan 15 , 2024 | 03:51 PM