ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎస్‌బీఐ ఎండీగా తెలుగు బిడ్డ రామమోహన రావు

ABN, Publish Date - Dec 19 , 2024 | 05:27 AM

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా తెలుగువాడైన అమర రామమోహన రావు నియమితులయ్యారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థాగత ఆర్థిక సేవల బ్యూరో...

న్యూఢిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా తెలుగువాడైన అమర రామమోహన రావు నియమితులయ్యారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థాగత ఆర్థిక సేవల బ్యూరో (ఎఫ్‌ఎ్‌సఐబీ) ఈ ఏడాది సెప్టెంబరులో ఈ పదవికి ఆయన పేరును సిఫారసు చేసింది. నియామకాల కేంద్ర కేబినెట్‌ కమిటీ బుధవారం ఇందుకు ఆమోద ముద్ర వేసింది. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఇంజినీరింగ్‌ పట్టభద్రుడైన రామమోహన రావు 1991లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎస్‌బీఐలో చేరారు. ప్రస్తుతం బ్యాంకు డిప్యూటీ ఎండీగా పని చేస్తున్నారు. గత 33 సంవత్సరాలుగా ఆయన ఎస్‌బీఐకు చెందిన వివిధ విభాగాల్లో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. గత ఏడాది ఆగస్టు వరకు ఎస్‌బీఐ అనుబంధ సంస్థ ఎస్‌బీఐ కార్డ్స్‌కు ఎండీ, సీఈఓగానూ పని చేశారు. అంతకు ముందు ఎస్‌బీఐ భోపాల్‌ సర్కిల్‌ సీజీఎంగానూ సేవలు అందించారు. సింగపూర్‌, అమెరికా దేశాల ఎస్‌బీఐల్లోనూ కీలక భాధ్యతలు నిర్వర్తించారు.


పనితీరు ఆధారంగా రామమోహన రావు పదవీ కాలాన్ని రిటైర్మెంట్‌ వయసు 2028 ఫిబ్రవరి 29 వరకు పొడిగించే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. మరో తెలుగువారైన శ్రీనివాసులు శెట్టి ఇప్పటికే ఎస్‌బీఐ చైర్మన్‌గా పని చేస్తున్నారు. ఎస్‌బీఐ చరిత్రలో ఇద్దరు తెలుగు వారు ఒకే సమయంలో రెండు కీలక బాధ్యతలు నిర్వహించడం ఇదే మొదటిసారి. శ్రీనివాసులు శెట్టిని ఎస్‌బీఐ చైర్మన్‌గా నియమించడంతో ఏర్పడిన ఎండీ పోస్టులోనే రామ మోహన రావు బాధ్యతలు స్వీకరించనున్నారు.

Updated Date - Dec 19 , 2024 | 05:27 AM