Gold and Silver Price Today: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
ABN, Publish Date - May 17 , 2024 | 10:17 AM
Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ గత కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్న పుత్తడి ధరలకు ఇవాళ బ్రేక్ పడింది. రివర్స్ గేర్ వేసుకుని.. రూ. 270 తగ్గింది. శుక్రవారం నాడు 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ 10 గ్రాములకు రూ. 270 తగ్గగా.. 22 క్యారెట్స్ గోల్డ్‌పై రూ. 250 తగ్గింది.
Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ గత కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్న పుత్తడి ధరలకు ఇవాళ బ్రేక్ పడింది. రివర్స్ గేర్ వేసుకుని.. రూ. 270 తగ్గింది. శుక్రవారం నాడు 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ 10 గ్రాములకు రూ. 270 తగ్గగా.. 22 క్యారెట్స్ గోల్డ్‌పై రూ. 250 తగ్గింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం రూ. 73,750 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ రూ. 67,600 ఉంది. అదే సమయంలో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. గురువారం, శుక్రవారం ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో వెండి కిలో ధర రూ. 89,200 పలుకుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంది. మరి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఈ ధరలు ఎంత ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం. హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,750 పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 67,600 గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 73,750, 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 67,600 ఉంది. విశాఖపట్నంలోనూ బంగారం ధరలు ఇలాగే ఉన్నాయి. ఇక వెండి ధరల విషయానికి వస్తే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఒకే విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 92,500 గా ఉంది. విజయవాడలో - 92,500, విశాఖపట్నంలో - 92500 పలుకుతోంది.
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..
దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల మేలిమి(24 క్యారెట్స్) ధర రూ. 73,900 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 67,750 గా ఉంది. వెండి ధర రూ. 89,100 గా ఉంది. దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబైలో 24 క్యారెట్స్ 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర రూ. 73,750 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 67,600 గా ఉంది. వెండి ధర రూ. 89,100 ఉంది. చెన్నైలో 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 73,850 పలుకుతోంది. 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 67,700 ఉంది. వెండి ధర రూ. 92500 గా ఉంది. కోల్‌కతాలో మేలిమి బంగారం ధర రూ. 73,750 ఉండగా.. 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 67,600 గా ఉంది. వెండి ధర రూ. 89,100 పలుకుతోంది. బెంగళూరులో 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 73,750 ఉండగా.. 22 క్యారట్స్ బంగారం ధర రూ. 67,600 గా సేల్ అవుతోంది. ఇక సిల్వర్ ప్రైజ్ రూ. 88,500 గా ఉంది.
For More Business News and Telugu News..
Updated Date - May 17 , 2024 | 10:17 AM